Advertisement
Google Ads BL

భారతీయురాలుగా నయనతార..!


శంకర్ - రజినీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కిన '2.0' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. గ్రాఫిక్స్ కి సంబందించిన పనులు వలన విడుదల లేట్ అవుతూ వచ్చిన '2.0' ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి శంకర్ '2.0' విడుదల తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా 'ఇండియన్ 2' సినిమాని డైరెక్ట్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. '2.0' హడావిడి అలా ముగుస్తుందో లేదో ఇలా 'ఇండియన్ 2' సందడి మొదలు కానుంది. 'ఇండియన్ 2'  సినిమాకి టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తాడని అధికారికంగా ఎనౌన్స్ మెంట్ జరిగినప్పటికీ ఇప్పుడు దిల్ రాజు 'ఇండియన్ 2' నిర్మాతగా తప్పుకున్నాడు. దిల్ రాజు అలా తప్పుకున్నాడో లేదో ఇలా '2.0' నిర్మాతలు లైకా వారు 'ఇండియన్ 2' ప్రాజెక్ట్ ని కూడా చేజిక్కించుకున్నట్టుగా వార్తలొచ్చాయి.

Advertisement
CJ Advs

ఇకపోతే భారతీయుడుకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమల్ హాసన్ పక్కన నయనతార హీరోయిన్ గా చెయ్యనుందనే న్యూస్ కోలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తుంది. భారతీయుడులో కమల్ హాసన్ పక్కన సుకన్య పోషించిన విప్లవ పాత్ర రోల్‌నే ఇప్పుడు 'ఇండియన్ 2' లో నయనతార చేయనుందని టాక్ బయటికొచ్చింది. మరి సుకన్య పాత్రలో నయనతార నటిస్తే మెయిన్ హీరోయిన్ గా మరొకరు కావాలి. మరి ఇప్పుడు 'ఇండియన్ 2' లో మెయిన్ లీడ్ హీరోయిన్ గా ఎవరు నటిస్తారో అనేది ఆసక్తిగా మారింది.

మరి ప్రస్తుతం '2.0' పనుల్లో బిజీగా వున్న శంకర్ ఆ పనులు ఓ కొలిక్కి రాగానే 'ఇండియన్ 2' కి సంబందించిన నటీనటుల ఎంపిక మీద కసరత్తు మొదలు పెడతాడనే సమాచారం ఉంది. ఇకపోతే హాస్యనటుడు వడివేలు 'ఇండియన్ 2' లో కీలక పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు.

Nayanthara in Indian 2:

Nayanthara for Shankar and Kamal Haasan Indian 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs