Advertisement
Google Ads BL

'మహానటి' డౌటే..!!


ఎవ‌డే సుబ్రమ‌ణ్యం ఫెమ్ నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తున్న 'మహానటి' సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లే. సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నా 'మహానటి' సినిమాని మార్చ్ 29 న మెగా హీరో రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాకి పోటీగా విడుదల చెయ్యాలని 'మహానటి' నిర్మాతలు అశ్విని దత్ కూతుళ్లు ప్రియాంక ద‌త్‌, స్వప్న ద‌త్ ప్లాన్ చెయ్యడమే కాదు రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించారు. మరి మెగా హీరోతో బాక్సాఫీసు యుద్దానికి సిద్దమయిన మహానటి ఇప్పుడు వెనక్కివెళ్లే సూచనలు గట్టిగానే కనబడుతున్నాయి.

Advertisement
CJ Advs

ఎందుకంటే సీజీ వ‌ర్క్ డిలే కారణంగా 'మహానటి' సినిమా రిలీజ్ కి మరింత స‌మ‌యం పట్టే అవకాశం వుందని చిత్ర బృందంలోని ఒకరి మాట. సిజి వర్క్ లేట్ అవడంతో 'మహానటి' మార్చిలో విడుదల కష్టంగా చెబుతున్నారు. మరి మార్చిలో మెగా హీరో రామ్ చరణ్ కూడా ఉండడంతో మహానటిని పోస్ట్ పోన్ చేసే సూచనలు గట్టిగానే ఉన్నట్టుగా చెబుతున్నారు. మరి ఈ లెక్కన మెగా హీరో రామ్ చరణ్ తన రంగస్థలంతో సోలో గా వచ్చి బాక్సాఫీసును దడదడ లాడించేయనున్నాడన్న మాట.

ఇకపోతే మహానటి సినిమా మీద భారీ అంచనాలున్నాయి. అలనాటి మేటి తార సావిత్రి జీవిత కథ ఈ అంచనాలకు ఒక కారణం.. కాగా ఈ సినిమాలో టాప్ హీరోయిన్స్ కీర్తి సురేష్, సమంత నటించడంతో పాటే... సావిత్రి భర్త హీరో జెమిని గ‌ణేష‌న్ పాత్రలో మ‌ల‌యాళ హీరో దుల్కర్ స‌ల్మాన్ కనిపించడం దగ్గర నుండి...... ఎస్వీఆర్‌గా మోహ‌న్‌బాబు, ఏఎన్నార్‌గా విజ‌య్‌ దేవ‌ర‌కొండ నటించడం కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలకు కారణమయ్యాయి.

Doubts on Mahanati Movie Release:

Mahanati Movie Shooting not completed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs