Advertisement
Google Ads BL

పవన్‌ విషయంలో స్పష్టత వస్తోంది!

pawan kalyan,janasena,puttaparthi,saibaba,dist,anantapur | పవన్‌ విషయంలో స్పష్టత వస్తోంది!

ఒకవైపు ప్రత్యేకహోదా ఇవ్వకపోయే సరికి వచ్చే ఎన్నికల్లో పవన్‌ బిజెపికి మద్దతు ఇచ్చేది లేదు. ఇక టిడిపి, బిజెపిల మధ్య కూడా స్నేహం ఉండే అవకాశం కనిపించడం లేదు. దాంతో వచ్చే ఎన్నికల్లో టిడిపి, వామపక్షాలు, పవన్‌లు కలసి పొత్తు పెట్టుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న పవన్‌ వచ్చే ఎన్నికల్లో రైతులకు ఎవరు సపోర్ట్‌ చేస్తే తాను వారికే మద్దతు ఇస్తానని ప్రకటించాడు. 

Advertisement
CJ Advs

ఇక అనంతపురంలోని గుత్తరోడ్డులో జనసేన కార్యాలయానికి భూమి పూజ నిర్వహించాడు. వచ్చే ఎన్నికల్లో అనంతపురంకి ఏమి చేస్తారో అడిగిన తర్వాతే ఎవరికైనా మద్దుతు ఉంటుందని చెప్పాడు. ఇక అనంతపురం పర్యటన సందర్భంగా ఆయన పరిటాల రవి భార్య, ఏపీ మంత్రి పరిటాల సునీతని కలిశాడు. ఆయనకు పరిటాల శ్రీరామ్‌ స్వాగతం పలికాడు. పరిటాల సునీత అయనకు రాగి సంగటి, పల్లీ చట్నీని అందించింది. మంత్రితో కలిసి అనంతపురం కరువుకు కారణాలను అధ్యయనం చేస్తున్నానని పవన్‌ ప్రకటించాడు. ఇక గతంలో తన భర్త పవన్‌కి గుండు కొట్టించిన వార్త నిజం కాదని సునీత తెలిపింది. 

ఇక పుట్టపర్తి సాయిబాబా పేరు మీద కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని, దానికి తన మద్దతు ఉంటుందని పవన్‌ ప్రకటించాడు. రాయలసీమ సమస్యలపై ఓ నివేదిక తయారు చేసి ప్రధాని మోదీకి అందిస్తానని పవన్‌ ప్రకటించాడు. ఇక పవన్‌ అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిని కలవడం మాత్రం సంచలనంగా మారింది.

Pawan Kalyan Janasena way Revealed:

Pawan Kalyan wants Puttaparthi Saibaba District
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs