Advertisement
Google Ads BL

ప్రేమ ఎంత కష్టమో శ్రియని అడగండి!


శ్రియాశరన్‌.. నేటి తరం టీనేజ్‌ యువకులు పుట్టకముందే ఈమె హీరోయిన్‌గా పరిచయమైంది. తన సుదీర్ఘ కెరీర్‌లో సీనియర్‌ స్టార్స్‌ నుంచి యంగ్‌ స్టార్స్‌ వరకు అందరితో జోడీ కట్టి హిట్‌ పెయిర్‌ అనిపించుకుంది. నేటికీ సందీప్‌కిషన్‌ నుంచి ఎందరో సరసన నటిస్తోంది. ఇక ఈమెని తరుచుగా మీరు ఎవరితోనైనా డేటింగ్‌కి వెళ్లారా? అనే ప్రశ్నతో విసిగిస్తున్నారట. ఈ విషయం గూర్చి ఆమె మాట్లాడుతూ, డేటింగ్‌కి వెళ్లాలంటే ఎంతోప్రేమ ఉండాలి. నిజమైన ప్రేమికులు మాటలు లేకపోయినా ఒకరినొకరు చూసుకుంటూ గడిపేయగలరు. 

Advertisement
CJ Advs

ఇక నేను హీరోలతో డేటింగ్‌ విషయానికి వస్తే హీరోలకు రోజులో సగం రోజు అద్దం ముందే సరిపోతుంది. మిగిలిన సగం రోజు నేను అద్దం ముందు ఉండటంతో పూర్తయి పోతుంది. ఇక డేటింగ్‌కి సమయం ఎక్కడ ఉంటుంది? అయినా ప్రేమించడం అంత తేలిక కాదు. ఈ ప్రపంచంలో అన్నింటి కంటే కష్టమైన పని ప్రేమలో పడటం. కానీ అందరు ఏదో నోటి నుంచి సింపుల్‌గా ఐలవ్‌యు అని చెప్పడం నాకు ఆశ్చర్యం వేస్తుంది. నా గురించి చాలా గాసిప్స్ రాస్తుంటారు. కానీ వాటిల్లో నిజం ఉండదు. 

జీవితంలోని ప్రతి విషయంపై నాకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. దానిని బట్టే నా ప్రవర్తన ఉంటుంది.... అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం శ్రియ తెలుగులో 'గాయత్రి, వీర భోగ వసంత రాయులు' తమిళంలో 'నరగాసురన్‌', హిందీలో 'తడ్కా' చిత్రాలలో నటిస్తోంది.

Shriya Takes Love Classes:

Sharing her thoughts on love Shriya says falling in love is not that easy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs