Advertisement
Google Ads BL

బిగ్‌బి పై వచ్చేవన్నీ పుకార్లే..!


సాధారణంగా 'సైరా...నరసింహారెడ్డి' వంటి భారీ బడ్జెట్‌తో నిర్మించే చిత్రాల విషయంలో చివరి నిమిషాలలో ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ముందుగా అనుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు వైదొలగడం వంటివి కామన్‌గా జరుగుతూనే ఉంటాయి. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి సినిమాటోగ్రాఫర్‌తో పాటు సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహ్మాన్‌ కూడా తప్పుకున్నాడు. ఆతర్వాత అమితాబ్‌బచ్చన్‌, నయనతారలు కూడా తప్పుకున్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కొంతమంది అది నిజమే అయి ఉంటుందని కూడా భావించారు. 

Advertisement
CJ Advs

కానీ తాజాగా ఈ విషయంలో 'సై.రా...' టీం క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రంలో బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌తో సహా నయనతార కూడా నటిస్తున్నట్లు తేల్చిచెప్పింది. మొదటి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్‌ షెడ్యూల్‌ కోసం పొలాచ్చి వెళ్లనుందని సమాచారం. ఇదే షెడ్యూల్‌తో ఉయ్యాల వాడ నరసింహారెడ్డికి కీలక గురువు పాత్రలో నటించే అమితాబ్‌బచ్చన్‌ షూటింగ్‌ కూడా ఇదే షెడ్యూల్‌ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి అమితాబ్‌ విషయంలో వస్తున్న వార్తలకు టీం తొందగానే చెక్‌ పెట్టింది. 

మరోవైపు సంగీత దర్శకులుగా తమన్‌, కీరవాణిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సీనియర్‌ రైటర్స్‌ అయిన పరుచూరి బ్రదర్స్‌, సత్యానంద్‌ వంటి వారు తమ అనుభవాన్నంతా ఉపయోగించి, స్క్రిప్ట్‌, డైలాగ్స్‌ విషయంలో సహాయం చేస్తున్నారు. స్టోరీనీ కూడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా క్రాస్‌ ఎగ్జామ్‌ కూడా చేస్తున్నారని తెలుస్తోంది. 

Big B to join Chiranjeevi Sye Raa shooting:

Amitabh Bachchan to join Chiranjeevi on the sets of Sye Raa Narasimha Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs