Advertisement
Google Ads BL

'బావా' అంటూ సందడి చేసింది...!


అనసూయ బుల్లితెర, వెండితెరపైనే కాదు.. బయట కూడా ఎంతో లౌక్యం చూపిస్తూ, తనదైన యాటిట్యూడ్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా 'గాయత్రి' ఆడియో వేడుక నిలిచింది. ఈ వేడుకలో అనసూయ మోహన్‌బాబుని ఉద్దేశించి 'బావా' అని సంబోధించింది. దీనికి మోహన్‌బాబు స్పందిస్తూ తనను తన భార్య బావ అని పిలిచేదని, కానీ తనకు హిట్లు రాకపోవడంతో అలా పిలవడం మానుకుందని అన్నాడు. సక్సెస్‌లు లేకపోతే ఎవరూ పిలవరని చెప్పి, అనసూయని రా.. అని పిలిచి షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. 

Advertisement
CJ Advs

అనసూయ ఎంతో సిన్సియర్‌ అని చెబుతూ, ఆమె గురించి తనకు ఎవరెవరో ఏమో చెప్పారని, మంచు లక్ష్మి అయితే అనసూయని పొగడటమే పనిగా పెట్టుకుంది. ఈసారి మంచు విష్ణు వచ్చి 'డాడీ..షి ఈజ్‌ వెరీ గుడ్‌ గాళ్‌' అని కాంప్లిమెంట్‌ ఇచ్చాడు. వాస్తవానికి ఈ ఫంక్షన్‌కి అనసూయని పిలవాలని అనుకోలేదని మోహన్‌బాబు అన్నారు. ఏది ఏమైనా మంచు విష్ణు మా ఇద్దరిని కలిపాడు. క్రెడిట్‌ మొత్తం విష్ణుకే దక్కుతుంది. నాకు ప్రతి సినిమాలోనూ ఎవరితో ఒకరితో గొడవ ఉంటూనే ఉంటుంది. ఈ సినిమాకి ఎంతో కంట్రోల్‌ చేసుకున్నాను. ఎవరితోనూ గొడవ జరగకూడదని దేవుడిని ప్రార్ధించి షూటింగ్‌కి వెళ్లేవాడిని అని చెప్పుకొచ్చాడు. 

Anasuya Baava speech Highlights at Gayatri Audio Launch:

Is The Senior Hero Mohan Babu Anasuya Bharadwaj's Bava!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs