Advertisement
Google Ads BL

అప్పుడే 152వ చిత్రం గురించి వార్తలు..!!


ఇప్పటివరకు మెగాస్టార్‌ చేయనటువంటి లార్జ్‌ కాన్వాస్‌పై 'సై..రా' చిత్రం రూపొందనుంది. కొత్త వాడైన ప్రభాస్‌ 'బాహుబలి' తో కొట్టిన రికార్డులను తాను ప్రభాస్‌ కంటే సీనియర్‌గా ఆల్‌రెడీ బాలీవుడ్‌లో కూడా చిత్రాలు చేసిన మెగాస్టార్‌గా ఆయన చరిత్రను తిరగరాసే కసితో తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' బయోపిక్‌గా 'సై..రా..నరసింహారెడ్డి'ని చేస్తుండటం, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని స్వయంగా ఆయన కుమారుడు రామ్‌చరణ్‌ తమ కొణిదెల బేనర్‌లో రెండో చిత్రంగా నిర్మిస్తుంటం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియని తొలి స్వాతంత్య్ర సమర యోధుడి స్టోరీ కావడంతో అన్ని భాషల్లో దీనిపై క్రేజ్‌ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇంతటి భారీ ప్రాజెక్ట్‌ని మెగాస్టార్‌ ఎంతో నమ్మి మరీ సురేందర్‌రెడ్డి చేతుల్లో పెట్టాడు. అమితాబ్‌బచ్చన్‌, ప్రియాంకా చోప్రా, సుదీప్‌, జగపతిబాబు, నయనతార, విజయ్‌సేతుపతి వంటి పరభాషా నటులు కూడా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. 

Advertisement
CJ Advs

ఈ వయసులో గుర్రపుస్వారీ, యుద్ద విన్యాసాల శిక్షణ కోసం మెగాస్టార్‌ ఎంతో కష్టపడుతున్నాడని అంటున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత మెగాస్టార్‌ ఎవరి చిత్రంలో నటిస్తాడు? అనే దానిపై కూడా ఆసక్తి ఉంది. అయితే సైరా వంటి ప్రిస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ చేస్తున్న తరుణంలో మెగాస్టార్‌ ఇప్పుడే తన తదుపరి చిత్రం గురించి ఆలోచన చేస్తాడా? అనేది సందేహమే. ఎందుకంటే తదుపరి 152 వ చిత్రంగా మెగాస్టార్‌ ఏ చిత్రం చేయనున్నాడు? అనేది బహుశా 'సై..రా..' సాధించే విజయంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పాలి. ఇక 150వ చిత్రం చేసే సమయంలో కూడా తన 151 వ చిత్రాన్ని అల్లుఅరవింద్‌కి బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రం చేస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అవి నిజం కాలేదు. ఇప్పుడు మరలా అలాంటి వార్తలే మెగాస్టార్‌ 152 వ చిత్రం విషయంలో వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం రామ్‌చరణ్‌ సుకుమార్‌ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ స్పాట్‌కి పలుసార్లు మెగాస్టార్‌ వెళ్లాడు. ఈ సందర్భంగా మెగాస్టార్‌కి సుకుమార్‌ ఓ కొత్త స్టోరీ పాయింట్‌ని చెప్పాడని, అది చిరంజీవికి నచ్చడంతో 'సై..రా' తర్వాత చిరు చేయబోయే చిత్రం అదేనని వార్తలు వస్తున్నాయి. అయితే 'సైరా..' విజయం సాధించిన పక్షంలోఇకపైన చిరు చేసే ప్రాజెక్ట్స్‌ ఎక్కువగా బహుభాషా చిత్రాలుగానే ఉంటాయని వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో మెగా కాంపౌండ్‌కే తెలియాలి.

Rumours on Chiranjeevi 152 Movie:

Chiranjeevi 152 movie in Sukumar Direction
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs