Advertisement
Google Ads BL

కొత్త అవతారంలో అల్లువారబ్బాయి!


అగ్రనిర్మాత అల్లు అరవింద్‌ గారి పెద్దకుమారుడు అల్లు అర్జున్‌ స్టార్‌గా దూసుకుని వెళ్తున్నాడు. దీంతో తమ చిన్నబ్బాయి అల్లు శిరీష్‌ని కూడా సక్సెస్‌ఫుల్‌ హీరోగా నిలబెట్టాలని ఆయన తండ్రి చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. 'గౌరవం, కొత్త జంట'నుంచి మోహన్‌లాల్‌ మలయాళ చిత్రంలో కూడా ఓ పాత్రను పోషించాడు. ఇక ఈయన కెరీర్‌లో ఆ మధ్య వచ్చిన 'శ్రీరస్తు..శుభమస్తు' చిత్రం మాత్రమే ఫర్వాలేదనిపించింది. నిఖిల్‌కి 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో మెమరబుల్‌ హిట్‌ని ఇచ్చిన విఐ ఆనంద్‌ని పట్టుకుని 'ఒక్క క్షణం' తీశాడు. ఈ చిత్రానికి మంచి టాకే వచ్చినా సినిమా ఆడలేదు. 

Advertisement
CJ Advs

ఇక అల్లు శిరీష్‌ సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. ఆయనకు సోషల్‌మీడియాలో మంచి ఫాలోవర్స్‌ ఉన్నారు. కానీ వారిని థియేటర్‌ వరకు రప్పించడంలో శిరీష్‌ విఫలమవుతున్నాడు. ఇక ఐఫా అని ఏవో ఒక కార్యక్రమాలకు తన యాంకరింగ్‌ ద్వారా కూడా ఈయన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇన్ని విధాలుగా ప్రయత్నిస్తూన్నా హీరోగా మాత్రం సక్సెస్‌ ఈయనకి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇక తాజాగా ఈయన ఓ వెబ్‌సైట్‌ కోసం యాంకర్‌గా మరో అవతారం ఎత్తి తనకు మంచి పరిచయం ఉన్న సీరత్‌ కపూర్‌ని 'టచ్‌చేసి చూడు' చిత్రం విడుదల సందర్భంగా మంచి పంచ్‌లు, సెటైర్లతో ఇంటర్వ్చూ చేశాడు. 

ఇక త్వరలో రాబోయే తన సోదరుడు 'నాపేరు సూర్య... నా ఇల్లు ఇండియా' నాటికి మరింత బిజీగా మారి యాంకర్‌గా పూర్తి మార్కులు కొట్టేసి హీరోగా మరలా తనసత్తా చూపాలని భావిస్తున్నాడు. అందరూ యాంకర్ల నుంచి హీరోలవుతుంటే మనోడు కాస్త డిఫరెంట్‌గా హీరోగా ఉండి యాంకర్‌గా మార్కులు కొట్టేయాలని చూస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్‌, రానాల టైప్‌లో అల్లు శిరీష్‌కి కూడా హోస్ట్‌గా ఎంతటి పేరు వస్తుందో వేచిచూడాల్సివుంది.

Allu Sirish Turns Anchor For A Youtube Channel:

Allu Sirish who is regularly seen as a host in film functions was recently seen turning host for a YouTube channel called Pink Villa.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs