రాంగోపాల్ వర్మ ఓ చిత్ర విచిత్రమైన వ్యక్తి. కాగా ఆయన వద్ద రైటర్‌గా పనిచేసిన జయకుమార్ తాను తయారు చేసిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' కథని వర్మకి ఇచ్చి ఎలా ఉందో చూసిపెట్టమని అడగటంతో అదే కథను ఆయన కాపీ చేసి 'జీఎస్టీ'గా తీశాడని జయకుమార్ ఆరోపిస్తున్నాడు. ఇక ఎవరైనా కెరీర్ ప్రారంభంలో మంచి పేరున్న వారి వద్ద పనిచేస్తే తమకు భవిష్యత్తు బాగా ఉంటుందని భావిస్తారని, తాను కూడా అలాగే భావించి వర్మ వద్ద చేరినట్లు జయకుమార్ చెబుతున్నాడు.
ఇక వర్మ కాపీ క్యాట్ మాత్రమే కాదని, ఆయనలో మరో వ్యక్తి కూడా ఉన్నాడని జయకుమార్ సంచలన ఆరోపణలు చేయడంతో పాటు 'జీఎస్టీ' విషయంలో కోర్టుకి కూడా ఎక్కాడు. ఆయనలోని హోమో సెక్సువల్ విషయాన్ని తానెప్పుడు బయటికి చెప్పాలని భావించడం లేదంటూనే జయకుమార్ ఆ విషయాన్ని తెలివిగా బయటపెట్టాడు. వర్మకి రచయితలంటే గౌరవం లేదని, హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టీన్ విషయంలో ఎలాగైతే మీటూ అనే ఉద్యమాన్ని చేపట్టారో వర్మ విషయంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారు కూడా మీటు ఆర్జీవీ అనే ఉద్యమాన్ని చేపట్టాలని జయకుమార్ కోరాడు.
దీనిపై వర్మ స్పందించాడు. 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' కథ జయకుమార్ నుంచి తాను హ్యాక్ చేసింది కాదని, మా ఆఫీసులో దొంగతనం చేస్తూ జయకుమార్ ఎన్నోసార్లు పట్టుబడ్డాడని పేర్కొన్నాడు. మొత్తానికి జయకుమార్ కూడా వర్మని వదిలేలా మాత్రం కనిపించడం లేదనే చెప్పాలి.