Advertisement
Google Ads BL

స్టార్ హీరోలా దూసుకెళుతున్న అనుష్క!


స్టార్ హీరోస్ పై ఎంత పెట్టుబడి పెట్టిన అవి వెనక్కి వస్తాయో రావో నమ్మకాలూ తక్కువే. కానీ మన ప్రొడ్యూసర్స్  ధైర్యం చేసి స్టార్ హీరోస్ ని పెట్టి సినిమాలు తీసి నష్టపోతుంటారు. అయితే హీరో లేకుండా కేవలం హీరోయిన్ ని పెట్టి సినిమా తీశారంటే సాహసమే అని చెప్పాలి. అలానే యూవీ క్రియేషన్స్ వాళ్లు అనుష్క మీద నమ్మకంతో ఆమెను హీరోయిన్ గా పెట్టి ఫిమేల్ ఓరియెంటెడ్ 'భాగమతి' చిత్రాన్ని తీశారు.

Advertisement
CJ Advs

ఆమె మీద నమ్మకంతోనే ఈ సినిమాని బయ్యర్స్ కూడా భారీ రేట్లకి కొన్నారు. అనుష్కకి ఖచ్చితంగా ఓపెనింగ్స్‌ తెచ్చే సత్తా వుందని బయ్యర్లు నమ్మారు. అందరు ఊహించిన విధంగానే భాగమతి తొలిరోజు వసూళ్లు కళ్లు చెదిరేలా వచ్చాయి. సినిమా టాక్ కూడా పాజిటివ్ గా రావడంతో అటు మాస్ ఇటు క్లాస్ తేడా లేకుండా అన్ని ఏరియాల్లోనూ 'భాగమతి' మంచి వసూళ్లు సాధిస్తోంది.

ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఏవి సరిగా అందకపోవటంతో భాగమతి సినిమాపై అంచనాలు పెట్టేసుకున్నారు. ఈ సినిమాకి బయపడి మిగిలిన సినిమాలని కూడా వాయిదా వేసేశారు. అంతగా అంచనాలు పెంచిన అనుష్క తనపై ట్రేడ్‌కి, అభిమానులకి వున్న నమ్మకాన్ని కూడా నిలబెట్టుకుంటోంది. ఈ సినిమా  ఖచ్చితంగా అనుష్క కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశం వుంది.

Good Responce Anushka Bhaagamathie:

Blockbuster Report to Anushka Bhaagamathie <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs