Advertisement
Google Ads BL

భరత్ కి భలే హిట్ సెంటిమెంట్..!


మహేష్ బాబు ఇమేజ్ ని ఒక స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ఒక్కడు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో మహేష్ నటనకు అప్పట్లో అందరూ ఫిదా అయ్యిపోయారు. అందులో విలన్ గా నటించిన ప్రకాష్ రాజ్ కి కూడా మంచి పేరు వచ్చింది. ఇలా వీరి కాంబినేషన్ లో చాలానే సినిమాలు వచ్చాయి. మహేష్ మూవీస్ లో విలన్ గా ప్రకాష్ రాజ్ పోకిరి - బాబీ - సైనికుడు - అర్జున్ - బిజినెస్ మేన్ లాంటి సినిమాల్లో అన్నిటిలోనూ విలన్ పాత్రలే పోషించాడు. ఒక్క సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో మాత్రం ప్రిన్స్ తండ్రిగా మంచితనానికి ప్రతిరూపమైన సాఫ్ట్ రోల్ లో నటించాడు.

Advertisement
CJ Advs

అయితే ఈ మధ్య కాలంలో మహేష్ మూవీస్ లో ప్రకాష్ కనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు 'భరత్ అనే నేను' లో ఈ కాంబో రిపీట్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా హీరో పాత్ర చేస్తున్నాడు. మహేష్ కు ధీటుగా ప్రకాష్ రాజ్ ఇందులో ప్రతిపక్ష నాయకుడి పాత్ర చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. వీరిద్దరి మధ్య పొలిటికల్ పంచులతో సీన్స్ ని దర్శకుడు కొరటాల శివ ఓ రేంజ్ లో తీస్తున్నట్టు టాక్ వస్తోంది.

ప్రకాష్ రాజ్ పాత్ర వేసే ఎత్తులకు - కుట్రలకు మహేష్ తనదైన స్టైల్ లో తిప్పి కొట్టి ఎపిసోడ్స్ థ్రిల్ చేయటం ఖాయం అంటున్నారు. మహేష్ బాబు సినిమాల్లో ప్రకాష్ రాజ్ విలన్ గా చేసిన పాత్రలన్నీ సూపర్ హిట్టే. కొన్ని సినిమాలు తప్ప. అయితే ఇప్పుడు మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది కాబట్టి సెంటిమెంట్ కూడా వర్కవుట్ అవుతుంది అని ఫాన్స్ నమ్ముతున్నారు. ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. మార్చ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకుని ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.

Hit Sentiment to Mahesh Bharath Ane Nenu Movie:

Prakash Raj Villian in Bharath Ane Nenu Movie 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs