Advertisement
Google Ads BL

సూరి కుమారుడు 'సైరా.. బుల్లోడు'..!


'రేసుగుర్రం, దృవ' చిత్రాలతో మెగా కాంపౌండ్‌కి ఎంతో సన్నిహితమున్న దర్శకునిగా సురేందర్‌రెడ్డి మారాడు. చిరంజీవి చేస్తున్న 151వ చిత్రం 'సై..రా..నరసింహారెడ్డి' కోసం అహర్నిశలు కష్టపడుతోంది. వచ్చే నెల నుంచి రెండో షెడ్యూల్‌ని ప్రారంభించడానికి కసరత్తులు మొదలయ్యాయి. ఇక ఈ చిత్రం సబ్జెక్ట్‌ విషయంలో సీనియర్‌ రచయితలు పరుచూరి బ్రదర్స్‌ నుంచి సత్యానంద్‌ వరకు పాలు పంచుకుంటున్నారు. ఇక సురేందర్‌రెడ్డి కూడా ఇదే చిత్రం లోకంగా బతికేస్తున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక 'సైరా'.. కోసం మెగాస్టార్‌ లుక్‌ దాదాపు ఫైనల్‌ అయిపోయింది. ఈ గెటప్‌లో తాను కనిపించాలని దర్శకుడు సురేందర్‌రెడ్డి-దీపారెడ్డిల ముద్దుల కుమారుడు ఆరిక్‌రెడ్డి నానా గోల చేయడంతో సురేందర్‌రెడ్డి తన కాస్ట్యూమర్స్‌కి చెప్పి మరీ తన కుమారుడు ఆరిక్‌ రెడ్డికి సైరా గెటప్‌తో కాస్ట్యూమ్స్‌ని కుట్టించి వేసి సరదా తీర్చుకున్నాడు. ఈ బుల్లి సైరా గెటప్‌లో ఈ బుడతడు అదరగొడుతున్నాడు. గతంలో రామ్‌చరణ్‌ గుర్రం ఎక్కి స్వారీ చేసిన ఈ బుడ్డాడు ఇప్పుడు సైరా గెటప్‌లో చూపిస్తున్న స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఎంతైనా కోరుకోవాలే గానీ కొండ మీద కోతినైనా తెచ్చి ఇచ్చే కుటుంబంలో సైరా డ్రస్‌ గెటప్‌లు ఏమి ఖర్మ . పెద్దయిన తర్వాత తానే హీరోగా నటిస్తానని చెప్పినా సురేందర్‌రెడ్డి దానికి కాదనకపోవచ్చు అని ఈ పిక్స్‌లో తన కుమారుడిని చూసి మురిసిపోతున్న సురేందర్‌రెడ్డిని చూస్తేనే అర్ధమైపోతుంది.

Little Sye Raa Rocking:

Cute and Little Sye Raa Narasimhareddy Rocks
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs