Advertisement
Google Ads BL

బాలయ్య హ్యాపీగా లేడంట..!


కెరీర్ లో 100 చిత్రాల మైలురాయి అరుదైన ఘనతగా భావించే నేటి తరంలో మెగాస్టార్ చిరంజీవి తరువాత ఆ సంఖ్య దాటిన హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ 100 వ చిత్రం నుంచే తన కథల ఎంపికలో వైవిధ్యం తప్పక కనపడుతుందని మాట ఇచ్చిన బాలయ్య 100 వ చిత్రం చారిత్రాత్మక కథని, తరువాత 101 మరియు 102 చిత్రాలలో ఇప్పటి వరకు చేయని తరహా మాస్ పాత్ర మరియు సెంటిమెంట్ పండించే పాత్రలో మెప్పించిన బాలయ్య 103 వ చిత్రంగా తన తండ్రి సర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ కి సిద్దమైన సంగతి విదితమే.

Advertisement
CJ Advs

ముందుగా ప్రకటించిన ప్రణాళిక ప్రకారం రామారావు వర్ధంతి నాడు ఈ చిత్ర టీజర్ విడుదల కావలసి ఉన్నప్పటికీ దర్శకుడు తేజ కట్ చేసిన టీజర్, దానికి వాడిన లైటింగ్ ఎఫెక్ట్స్ మరియు మేకింగ్ వ్యాల్యూస్ బాలయ్యని తృప్తి పరచలేకపోయాయని టాక్. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ఏ చిన్న విషయంలోనూ రాజీ పడటం ఇష్టం లేని బాలయ్య టీజర్ విడుదల ప్లాన్ నిలిపి వేశారట. ప్రస్తుతం తేజ విక్టరీ వెంకటేష్ చిత్రంతో బిజీ అవుతుండటంతో ఆయన పనితనంపై అసంతృప్తితో ఉన్న బాలయ్య ఈ గ్యాప్ లో మరో దర్శకుడికి ఎన్.టి.ఆర్  బయోపిక్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా వున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Balayya Not Happy with Teja Direction:

Balakrishna Not Satisfied with Teja Work on NTR Biopic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs