బాహుబలి సినిమా తర్వాత అనుష్క భాగమతితో సందడి చేస్తుంది. కానీ ప్రభాస్ మాత్రం బాహుబలి తర్వాత సాహో సినిమాలో నటిస్తున్నాడు. కానీ సాహో సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ నటిస్తుంది. సాహో సినిమా తర్వాత ప్రభాస్ మళ్లీ ఎలాంటి సినిమాలో నటిస్తాడో అనే దాని మీద అప్పుడే చర్చ మొదలైంది. అయితే ఆ సినిమా బాలీవుడ్ సినిమా కూడా అవుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ ప్రభాస్ సాహో తర్వాత రాధ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాకు సైన్ చేశాడు.
అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా సాహో సినిమాకి హీరోయిన్ గా శ్రద్ద కపూర్ ని తీసుకొచ్చారు. మరి రాధాకృష్ణ డైరెక్టన్ లో ప్రభాస్ నటించబోయే సినిమా కోసం ఇప్పుడు ఏ భాష హీరోయిన్ ని తీసుకోవాలా అని అన్ని ఇండస్ట్రీలలో అప్పుడే హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టేసింది చిత్ర బృందం. అయితే మళ్లీ బాలీవుడ్ హీరోయిన్స్ కే ఓటేశాలా కనబడుతున్నారు. అందులో భాగంగానే ప్రభాస్ పక్కన నటించడానికి దీపికా కోసం ట్రై చేశారనే టాక్ బయటికి వచ్చింది. మరి దీపికా పదుకొనె నటించిన పద్మావత్ చిత్రం సూపర్ హిట్ అయ్యి కూర్చుంది. ఆ హిట్ లో ఉన్న ఆనందంతో దీపికా సౌత్ స్టార్ ప్రభాస్ పక్కన నటించేందుకు నో చెప్పిందట. అయితే ఈసారి ఒక లేత బాలీవుడ్ భామను ప్రభాస్ కోసం ట్రై చేస్తున్నారట.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ను ప్రభాస్ కోసం తీసుకొస్తున్నారనే టాక్ కూడా బయటికొచ్చింది. సారా అలీ ఖాన్.. సైఫ్ అలికి మొదటి భార్య కూతురు. సారా అలీ ఖాన్ ఈ ఏడాది కేధర్నాథ్ సినిమాతో వెండితెరకు అరంగేట్రం చేయబోతోంది. ఇందులో సుశాంత్ సింగ్ రాజపుట్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అయితే ప్రభాస్ పక్కన హీరోయిన్ అనగానే సారా అలీ ఖాన్ ఫుల్ హ్యాపీతో కథ కూడా వినడానికి సిద్ధంగా ఉందట. కథ నచ్చితే మా అమ్మ అమృత పర్మిషన్ తోనే ఈ సినిమాలో నటిస్తానని మాటిచ్చినట్లుగా తెలుస్తోంది.