Advertisement
Google Ads BL

శ్రీదేవి కూతురు అందుకు కూడా సిద్ధమవుతోంది!


ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి నటిస్తున్న 'ధడక్‌' చిత్రంపైనే ఉంది. ఇది 15కోట్లతో రూపొంది ఏకంగా 100కోట్లకుపైగా కలెక్ట్‌ చేసిన మరాఠి చిత్రం 'సైరత్‌'కి రీమేక్‌. ఈ చిత్రం పరువు హత్యల నేపద్యంలో రూపొందుతోంది. ఇందులో అగ్రవర్ణానికి చెందిన యువతి మరో వెనుకబడిన కులంవాడితో ప్రేమలో పడుతుంది. దాంతో గ్రామ పెద్దలు, కుల పెద్దలు వారిని చంపేస్తారు. అయితే జాహ్నవికి ఇది మొదటి చిత్రంకావడంతో క్లైమాక్స్‌ని మార్చనున్నారని సమాచారం. ఇందులో షాహిద్‌కపూర్‌ సోదరుడు ఇషాన్‌కట్టర్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. కరణ్‌జోహార్‌ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రానికి శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జులై 20న విడుదల చేయాలని భావిస్తున్నారు. 

Advertisement
CJ Advs

మరోవైపు జాహ్నవి నటించే రెండో చిత్రంపై కూడా క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్‌ హీరోగా కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన 'టెంపర్‌' చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్‌ అవుతోంది. రణవీర్‌సింగ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రోహిత్‌శెట్టి దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రాన్ని కూడా కరణ్‌జోహారే నిర్మిస్తున్నాడు. తెలుగులో కాజల్‌అగర్వాల్‌ పాత్రకి ఏమాత్రం ఇంపార్టెన్స్‌ లేదు. జంతువులను పెంచుకుంటూ ఉండే యువతిగా, కొన్ని కామెడీసీన్స్‌, రెండు మూడు సెంటిమెంటల్‌ సీన్స్‌లో మాత్రమే కనిపిస్తుంది. 

కానీ 'టెంపర్‌'కి రీమేక్‌గా 'సింబా' టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకి ఎన్నో కొత్త హంగులు చేసి ఆమె ప్రాధాన్యతను పెంచుతున్నారని సమాచారం. మొత్తానికి మొదటి చిత్రం 'ధడక్‌'లో నటనకు స్కోప్‌ఉన్న పాత్రను చేస్తున్న జాహ్నవి తన రెండో చిత్రం ద్వారా గ్లామరస్‌గా కనిపించేందుకు నిర్ణయించుకుంది. 

Jhanvi kapoor in Temper Remake:

Jhanvi kapoor Second Movie Confirmed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs