Advertisement
Google Ads BL

మరోసారి బాలయ్య స్పష్టం చేశాడు!


ఎన్నో ఏళ్ల కిందటే దళితులు, ఇతర నిమ్నవర్గాలకి అండగా నిలబడిన శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రను ఎంతో ఇష్టంతో ఎన్టీఆర్‌ తెరపైకి తీసుకు వచ్చారు. అందులో తన కుమారుడు బాలకృష్ణ చేత కూడా నటింపజేశాడు. ఇక ప్రపంచంలోనే అతి గొప్ప వ్యక్తి, ఎన్నో వేల ఏళ్ల కిందటే దళిత, బడుగు, బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచి, చాపకూటి సిద్దాంతాన్ని ప్రతిపాదించినా రామానుజాచార్యలు జీవితాన్ని కూడా ఎన్టీఆర్‌ తన చివరి రోజుల్లో తెరకెక్కించాలని చూశారు. కానీ అనుకోకుండా ఆ స్థానంలో 'సామ్రాట్‌ అశోక్‌, శ్రీనాథ కవిసార్వభౌమ' చిత్రాలు వచ్చాయి. అలా తన తండ్రి తీయలేకపోయినా రామానుజాచార్యులు జీవిత గాధని తాను తన 60 వ ఏట అంటే మరో మూడేళ్ల తర్వాత తీస్తానని బాలకృష్ణ ప్రకటించారు. 

Advertisement
CJ Advs

తాజాగా ఆయన ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. చాపకూటి సిద్దాంతంతో పాటు పంచాక్షరీ మంత్రాన్ని అందరికీ ఉపదేశించి, కులాలు లేని సమాజం కోసం కలలు కన్న రామానుజాచార్యులుగా తాను నటిస్తానని, తన తండ్రి ఆ కోరిక తీరకుండానే మరణించాడని, ఆయన తీరని ఆలోటును తాను భర్తి చేస్తానని బాలయ్య హామీ ఇచ్చాడు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీతానగరం విజయకీలాద్రి పర్వతంపై శ్రీత్రిదండి చిన్న శ్రీమన్నారాయణ జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న బాలయ్య ఈ ప్రకటన చేశారు. 

Balakrishna again Confirms Movie on Ramanuja’s Biopic:

Nandamuri Balakrishna Confirms Legendary Philosopher Ramanuja’s Biopic after meeting with Chinna Jeeyar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs