Advertisement
Google Ads BL

హీరోలతో సమానంగా గౌరవం ఇస్తేనే: తాప్సీ!


మొత్తానికి తెలుగులో ఒక్కహిట్‌ కూడా లేని తాప్సిపన్ను బాలీవుడ్‌లో మాత్రం జోరు చూపుతోంది. 'జుడ్వా 2'లో బికినీ అందాలతో మెప్పించిన ఆమె అక్కడ మంచి పారితోషికమే తీసుకుంటోంది. అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. ఇక ఈమె తెలుగుని వీడి బాలీవుడ్ కి వెళ్లిన తర్వాతే ఆమెకి తెలుగులో కూడా మొదటి హిట్‌ 'ఆనందోబ్రహ్మ' వచ్చింది. ఇక ఈ చిత్రం గురించి తాప్సి మాట్లాడుతూ, ఈ చిత్రం యూనిట్‌ నాకోసం ఏడాది పాటు ఎదురుచూసింది. నాకు మంచి పాత్ర ఇవ్వడమే కాదు. షూటింగ్‌ సమయంలో కూడా ఎంతో గౌరవంగా చూసుకున్నారు. 

Advertisement
CJ Advs

ఇక నాకు లాభాలలో వాటా ఇచ్చారు. అలా నాకు కోటి రూపాయలు ముట్టింది. నా పాత్ర బాగా ఉండి, నన్ను బాగా గౌరవించే వారితోనే నేను నటిస్తాను. ఓ చిత్రం సందర్భంగా నా ఇంట్రడక్షన్‌ సీన్‌ని ఒకలా చెప్పారు. కానీ మరోలా తీశారు. ఏమిటి? ఇలా తీస్తున్నారు? మీరు ముందు చెప్పింది వేరే విధంగా కదా చెప్పింది అని అడిగాను. దాంతో యూనిట్‌లోని వారు హీరోగారు మార్చమన్నారు అని చెప్పారు. నాడే నేను నా పాత్రను బాగా చూపించి, నన్ను గౌరవించే వారితోనే నటించాలని నిర్ణయించుకున్నాను అని తెలిపింది. 

కోటి రూపాయలు తీసుకోవడం సరే... దానికి పన్ను కట్టిందా? అనే అనుమానం మాత్రం వస్తోంది. మరోవైపు ఈమె పాత్ర 'ఆనందోబ్రహ్మ'లో అంత సీన్‌ లేదు. ఏదైనా సినిమాలోని కమెడియన్స్‌ పుణ్యమా అని ఈ చిత్రం ఆడింది తప్పితే కేవలం తాప్సి కోసం ఏకంగా ఏడాది వెయిట్‌ చేసే సీన్‌ ఆ చిత్రంలో కనిపించలేదనేది వాస్తవం. 

Tapsee shares her row of insults :

Insulted Tapsee Takes Strong Decision  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs