మహేష్ నటిస్తున్న తాజా చిత్రం ఆడియోలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మహేష్‌బాబు చేసిన ప్రమాణ స్వీకారం ఫస్ట్ ఓత్ పేరిట తాజాగా విడుదల చేశారు. 50 సెకన్ల ఆడియోకు ఫస్ట్‌లుక్ వంటివేమీ జతచేయలేదు. మహేష్ వాయిస్ ఉన్న ఈ ఆడియో టేప్‌లో గవర్నర్ రాజ్యాంగ బద్దంగా చేయించే ప్రమాణ స్వీకారాన్ని మహేష్ చేత చేయించి కొరటాల శివ కొత్తగా ట్రై చేశాడు. ఈ వాయిస్‌లో మహేష్ గొంతు బేస్ బాగా ఉండగా, బ్యాగ్రౌండ్‌లో దేవిశ్రీ వినిపించిన స్కోర్ దీనికి మరింత అందం చేకూర్చింది...సో.. ఇందులో మహేష్ యంగ్ సీఎంగా కనిపించడం ఖాయమని తేలిపోయింది.
ప్రస్తుతం దీనితో మహేష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ ఆడియోని మహేష్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'భరత్ అనే నేను...శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసమూ, విధేయతా చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్దతో, అంత:కరణ శుద్దితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి, ప్రజలందరికీ న్యాయం చేస్తానని, దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేస్తున్నానని' మహేష్ చెప్పిన ఈ ప్రమాణ స్వీకారం అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది.
స్వాతంత్య్ర సమర పోరాటంలో దండి ఉప్పు సత్యాగహ్రం సందర్భంగా ఓ సమూహం కదలినట్లుగా ఇందులో పొందుపరిచారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ ఫక్షన్ పొలిటికల్ స్టోరీ అని స్పష్టమైపోయింది. మరి ఈ చిత్రం టైటిల్‌ని, మహేష్ సీఎం గెటప్‌ని ఎప్పుడు రివీల్ చేస్తారో వేచిచూడాల్సివుంది...!