Advertisement
Google Ads BL

ఆ ఒక్క సినిమానే ధృవ్ చేసేది: విక్రమ్!


కోలీవుడ్ లో నటన కోసం ప్రాణం పెట్టే హీరో ఎవరన్నా వున్నారంటే.. అది గ్యారంటీగా చియాన్ విక్రమే. రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్ళిపోతాడు విక్రమ్. అలానే తన కొడుకు ధృవ్ కూడా తన తండ్రిలానే డిఫరెంట్ టైప్ సినిమాలు చేయాలని అనుకుంటున్నాడట. ఎక్కువగా నటనకు ప్రాధాన్యం ఉండాలని, అందుకు తగ్గ కథలే ఎంచుకుంటున్నాడట.

Advertisement
CJ Advs

టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియెట్ చేసిన 'అర్జున్ రెడ్డి' సినిమాను తమిళంలో 'వర్మ'గా ధృవ్ చేయబోతున్నాడు. విలక్షణ దర్శకుడు బాల ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ధృవ్ చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాలు చేస్తాడని విక్రమ్ చెప్పిన మాటలు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. సాధారణంగా స్టార్ వారసులు సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు తీసుకుంటూ వెళ్లిపోతుంటారు. కానీ ధృవ్ మాత్రం గ్యాప్ తీసుకుంటున్నాడు.

ఎందుకంటే ధృవ్ కి ఇంకా స్టడీస్ కంప్లీట్ అవ్వలేదంట. 'అర్జున్ రెడ్డి' రీమేక్ తర్వాత తన స్టడీస్ కంప్లీట్ చేసి ఆ తరువాత నెక్స్ట్ స్టెప్ తీసుకునే విషయం గురించి ఆలోచిస్తాడట ధృవ్. ప్రస్తుతం అమెరికాలో మెథడ్ యాక్టింగ్ గురించి నేర్చుకొంటున్నాడని విక్రమ్ తెలిపాడు.

Chiyaan Vikram About His Son Dhruv Acting:

Chiyaan Vikram's son Dhruv to debut with Arjun Reddy Tamil remake
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs