మాస్, యాక్షన్ హీరోయిజం ఉన్న వారికే ఇమేజ్, క్రేజ్, లాంగ్ రన్ ఉంటాయనేది నిజమే. కానీ నేడు ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. ఇంతవరకు రొటీన్ యాక్షన్ చిత్రాలు చేయడం వల్లనే 'మగధీర' తర్వాత ఓవర్‌సీస్‌లో రామ్‌చరణ్‌కి పెద్దగా క్రేజ్ లేకుండా పోయింది. కానీ 'ధృవ' చిత్రంతో తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. ఓవర్‌సీస్‌లో కూడా క్లాస్, ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ప్రయోగాలకు పెద్ద పీటవేసే సుకుమార్‌తో చేస్తున్న 'రంగస్థలం' చిత్రంతో క్లాస్ ఆడియన్స్‌లో ఆయన స్థాయి, ఇమేజ్ మరో పదిరెట్లు పెరగడం ఖాయంగా కనిపిస్త్తోంది.
రవితేజ, రాజ్‌తరుణ్‌ల వంటి వారిలాగా ఇందులో వైవిధ్యంగా రామ్‌చరణ్ చెవిటి వాడుగా నటిస్తుండటం కూడా ప్లస్ అవుతుంది. ఇక చిరంజీవి కెరీర్‌లో 'చంటబ్బాయ్, స్వయంకృషి, ఆరాధన, ఆపద్బాంధవుడు, రుద్రవీణ' వంటి చిత్రాలు ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఇక ప్రయోగాత్మక చిత్రాలు చేయనని, నిర్మాతలకు నష్టంవచ్చే పనులు, అభిమానులు తన నుంచి ఆశించే అంశాలు లేకుండా సినిమాలు చేసేదే లేదనిచెప్పాడు.
ఇక రామ్‌చరణ్ నటిస్తున్న సుకుమార్ చిత్రం 'రంగస్థలం' విషయంలో కూడా చరణ్ నిర్ణయం చిరుకి నచ్చలేదనే చెప్పాలి. కానీ రామ్‌చరణ్ ఈ చిత్రంతో బ్లాక్‌బస్టర్ కొట్టి, ఈ చిత్రం విషయంలో డిజప్పాయింట్ అవుతున్న ఫ్యాన్స్, చిరంజీవి నిర్ణయం తప్పని నిరూపించాల్సిన బాధ్యత చరణ్, సుకుమార్‌లపై ఉంది. ఇక ఈ టీజర్ అద్భుతంగా ఉన్నా రామ్ చరణ్ మాట్లాడిన గోదావరి యాస సరిగాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.