Advertisement
Google Ads BL

పవన్‌లో లేనిది జగన్‌లో ఏం కనిపించిందో?


ఏపీలో ఉండవల్లి అరుణ్‌కుమార్‌, సబ్బంహరి, లగడపాటి రాజగోపాల్‌లని త్రిమూర్తులుగా చెప్పాలి. ముగ్గురు మేధావులే కాదు. రాష్ట్ర విభజన సమయంలో దానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడి, రాష్ట్రం విడగొట్టడం సోనియా తప్పు, రాష్ట్రం విడిపోతే ఇక మేము రాజకీయాలలో ఉండమని ప్రకటించి చెప్పిన మాటలకే కట్టుబడి ఉన్నారు. మిగిలిని రాజకీయ నాయకుల్లా మాట తప్పలేదు. ఇక ఉండవల్లి విషయానికి వస్తే ఆయన బహుమేధావి, వైఎస్‌రాజశేఖర్‌ రెడ్డి హయాంలో రోశయ్య, ఉండవల్లి లేకుంటే అసలు వైఎస్‌కి అంత పేరు వచ్చేదే కాదు.

Advertisement
CJ Advs

నాడు ఉండవల్లి మీడియా మొఘల్‌ రామోజీరావుని వైఎస్‌ కోరికమేరకు నానాతిప్పలు పెట్టాడు. ఇక ఈయన ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోయినా రాజకీయ విశ్లేషణలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఏపీలో టిడిపి, బిజెపిలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. మరోవైపు ప్రత్యేక హోదా ఇస్తే బిజెపికి మద్దతు ఇస్తానని జగన్‌ అంటున్నాడు. అంటే వచ్చేఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా బిజెపికి మిత్రుల కొరత మాత్రం లేదు.

ఇక కొత్తగా జనసేన పార్టీ వచ్చింది. పవన్‌ బలం ఉన్న చోట్లనే పోటీ చేస్తామని అంటున్నాడు. అయినా ఎన్నికల్లో పోటీ చేయకుండా బలమెలా అనేది ఆయనకు ఎలా తెలుస్తుంది? అంటూ సెటైర్‌ వేశాడు. ఇంతవరకు ఉండవల్లి చెప్పింది నిజమే. ఆయన ఇంకా మాట్లాడుతూ, జగన్‌కి సీఎంకి అయ్యే అర్హతలన్నీ ఉన్నాయి. చంద్రబాబు పాలనలో విఫలమయ్యాడు. నాలుగేళ్ల తర్వాత విభజన హామీలు నెరవేరలేదని ఇప్పుడు చెబుతున్నాడు అని ధ్వజమెత్తాడు. ఇక చంద్రబాబుకి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఆయన పాలనా అనుభవం, పరిపాలన దక్షత ఉన్నాయని అనుకోవచ్చు మరి జగన్‌కి ముఖ్యమంత్రి కావడానికి అవసరమైన అర్హతలన్నీ ఉన్నాయని ఉండవల్లి ఎలా చెబుతారు?

జగన్‌లో ఏ అర్హతలు చూసి ఆయన ఇలా మాట్లాడాడు. తన తండ్రిపై ఉన్న సింపతీ, తన తండ్రి ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాలు, కాంగ్రెస్‌లోని వారందరూ వైసీపీలోకి రావడంతో సంస్థాగతంగా కష్టపడకుండానే ఏర్పడిన క్యాడర్‌, ఆర్ధిక బలం తప్పితే జగన్‌కి ఏం అర్హతలు ఉన్నాయో ఉండవల్లికే తెలియాలి...!

Why Is Undavalli Supporting Ys Jagan :

Undavalli Arun Kumar Praises YS Jagan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs