Advertisement
Google Ads BL

ఈ పెద్దమనిషి నిర్ధోషినని అంటున్నాడు!


సమాజంలో పండితులుగా, కళాకారులుగా ఎంతో పేరున్న వారు కూడా అనవసర చేష్టలతో పరువు పోగొట్టుకుంటూ ఉంటారు. ఆ మధ్య అష్టావధాని, శతావధాని అయిన నాగఫణిశర్మ అమెరికాకి వెళ్లినప్పుడు తనను పిలిచి అతిధి మర్యాదలు చేసిన కుటుంబంలోని మహిళలను లైంగిక వేదింపులకి గురి చేసి పరువు పోగొట్టుకున్నాడు. ఇక తెలుగుకి గజల్స్‌ని పరిచయం చేసిన గజల్‌ శ్రీనివాస్‌ది కూడా అదే పరిస్థితి. ఈయన సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని తన ప్రసంగాలతో, పాటలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. కానీ లైంగిక వేధింపుల కేసులో జైలు పాలయ్యాడు. చంచల్‌గూడ జైలులో ఖైదీగా ఉన్నాడు.

Advertisement
CJ Advs

రిమాండ్‌ ఖైదీగా ఉన్న గజల్‌ శ్రీనివాస్‌కి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ని మంజూరు చేసింది. 10వేలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై విడుదల చేసింది. వారంలో బుధ, ఆదివారాలు పంజాగుట్టలోని పోలీస్‌స్టేషన్‌కి హాజరుకావాలని ఆదేశించింది. జైలు నుంచి విడుదలైన వెంటనే గజల్‌ శ్రీనివాస్‌ తాను నిర్దోషినని, ఈ కేసు నుంచి స్వచ్చంగా బయటపడతానని వ్యాఖ్యానించాడు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా పరుగెత్తుకుంటూ కారులోకి ఎక్కి వెళ్లిపోయాడు. ఎంతైనా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా? అన్నట్లుగా ఈయన తనకున్న పరువునంతా పోగొట్టుకున్నాడు అనే చెప్పాలి...! 

Ghazal Srinivas Granted Bail:

Bail granted to Ghazal Srinivas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs