Advertisement
Google Ads BL

రంగస్థలం టీజర్ పై సెలెబ్రెటీస్ ట్వీట్స్..!


సుకుమార్ తీసిన మాస్ సినిమా ‘రంగస్థలం’ పై రోజురోజుకి ఎక్సపెక్టేషన్స్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్టార్ ఐన దగ్గర నుండి ఇదొక వార్త బయటకు వచ్చి సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక నిన్న రిలీజ్ ఐన టీజర్ చూశాక అంతకుమించి ఎక్సపెక్టేషన్స్ ఎక్కువ అయ్యిపోయాయి. ఎందుకంటే ఆ టీజర్ ఆలా వుంది. టీజర్ చూసిన ప్రేక్షకుడితో పాటు టాలీవుడ్ టాప్ సెలెబ్రెటీస్ తమ ట్వీట్స్ ద్వారా వారి ఫీలింగ్ వ్యక్తపరిచారు.

Advertisement
CJ Advs

ఎస్‌.ఎస్‌. రాజమౌళి: చరణ్‌, సుక్కు (సుకుమార్)కు అభినందనలు. ఈ సీజన్‌లో నేను ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రమిది. 

అల్లు అర్జున్‌: వాహ్...         

లావణ్య త్రిపాఠి: రంగస్థలం టీజర్‌ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంది. చాలా చాలా బాగా రూపొందించారు. చిత్ర బృందానికి, మన సౌండ్‌ ఇంజనీరు దేవిశ్రీ ప్రసాద్‌కు శుభాకాంక్షలు.

అల్లు శిరీష్‌: చిట్టిబాబుకు హలో చెప్పండి. సుక్కు, మన రామ్‌చరణ్‌ రచ్చ చేశారు.

నవదీప్‌: అద్భుతం.

ప్రగ్యాజైశ్వాల్‌: టీజర్‌ చాలా నచ్చింది.. సినిమా కోసం ఎదురుచూస్తున్నా..

మారుతి: ఇది చరణ్‌బాబు, సుకుమార్‌ కెరీర్‌లోనే కచ్చితంగా ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది.

ఇలానే వీరితో పాటు చాలా మంది సెలెబ్రెటీస్ టీజర్ గురించి తమ అభిప్రాయాన్ని ట్వీట్స్ ద్వారా తెలియజేసారు. ఇక ఈ సినిమాలో చరణ్ కి జోడిగా సమంత నటిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ పని చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మార్చి 30న ఈ సినిమా విడుదల కాబోతోంది అని మేకర్స్ స్పష్టం చేశారు.

Celebrities Tweets on Rangasthalam Movie Teaser:

Celebrities Praises Ram Charan and Sukku after Teaser Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs