ఒకే గూటికి.. వర్మ, కత్తి మహేష్‌!


మొత్తంగా పవన్‌కళ్యాణ్‌ ఫ్యాన్స్‌తో వివాదం ద్వారా కత్తిమహేష్‌ పాపులర్‌ కావాలని, సెలబ్రిటీ కావాలని చేసిన ప్రయత్నం పవన్‌ అభిమానుల ఓవర్‌యాక్షన్‌ పుణ్యమా అని నెరవేరింది. ఇక ఈ విషయంలో వర్మ.. కత్తిమహేష్‌కి మద్దతు ఇచ్చాడు. దానికి కత్తిమహేష్‌ థ్యాంక్స్‌ కూడా చెప్పాడు. అలా తనకి మద్దతు ఇచ్చినందుకు కత్తి మహేష్‌.. వర్మకి తనవంతు సాయం చేస్తున్నాడని, వర్మ తీస్తున్న 'గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌'ని సమర్దించడం ద్వారా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 

ఇక ఈ జీఎస్టీ తీయడం కన్నా దానిని రిపబ్లిక్‌డే వంటి రోజున విడుదల చేయడం మరింత అభ్యంతకరం. ఇక ఇందులో నటిస్తున్న అమెరికన్‌ పోర్న్‌ స్టార్‌ మియా మల్కోవా పేరు మాత్రమే కాదు.. ఆమెకి సంబంధించిన విషయాలు కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక గూగుల్‌ స్టాటిస్టికల్‌ గ్రాఫ్‌ని తాజాగా వర్మ పోస్ట్‌ చేశాడు. ఇందులో మోదీ కంటే మియా మల్కోవాకే ఈమద్య క్రేజ్‌ ఎక్కువైనట్లు ఆ గ్రాఫ్‌లు సూచిస్తున్నాయి. రెండోస్థానంతో మోదీ సర్దుకోగా, మూడో స్థానాన్ని ముఖేష్‌ అంబానీ ఆక్రమించాడు. ఇక జీఎస్టీని సినిమాగా కాకుండా వెబ్‌వరల్డ్‌లో వర్మ రిలీజ్‌ చేస్తున్నాడు. 

ఇప్పటికే వర్మపై ఆందోళనకు దిగిన బిజెపి మహిళా మోర్చ నాయకులు వర్మపై విజయవాడ, అనంతపురం జిల్లాలోని పోలీస్‌స్టేషన్లలో కేసు నమోదు చేశారు. ఇక వెబ్‌మీడియాలో పలువురు ప్రముఖులు నటించిన పోర్న్‌ చిత్రాలు ఎన్నో ఉండగా, తన వీడియోపైనే ఎందుకు రాద్దాంతం చేస్తారని వర్మ ప్రశ్నిస్తున్నాడు. వర్మ వాదనకు ఫిల్మ్‌క్రిటిక్‌ అనే తోక తగిలించుకున్న కత్తి మహేష్‌ స్పందించాడు. వర్మ తీస్తున్న 'గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌' ఫుల్‌లెంత్‌ ఫ్యూచర్‌ ఫిల్మ్‌ కాదని, అది ధియేటర్లలో విడుదల కాదని, ఇది వెబ్‌మీడియాకి సంబంధించినదని, ఎందుకు దీనిపై రభస చేస్తున్నారో తనకి అర్ధం కావడం లేదని కత్తిమహేష్‌ ట్వీట్‌ చేశాడు. కేవలం దీనిని వర్మ తీస్తున్నందుకే ఇంత రచ్చ చేస్తున్నారా? భారతదేశానికి, సంస్కృతి, సాంప్రదాయాలకు ఆయన అంత పెద్ద ముప్పా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. 

దీనిపై వర్మ స్పందిస్తూ... 'హే కత్తిమహేష్‌, ఆందోళనకారుల అజ్ఞానం చూస్తే భయమేస్తోంది...' అని తెలిపాడు. ఇక తాను నమ్మని దెయ్యాలపై సినిమాలు తీసిన వర్మ తాను అసలు దేవుడినే నమ్మనంటూ గాడ్‌ పేరుతో 'గాడ్స్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌' తీయడం, భయం తనకి తెలియదని చెప్పిన ఆయన ఆందోళన కారుల అజ్ఞానం చూస్తే భయమేస్తోందని చెప్పడం చూస్తుంటే నవ్వు వేయకమానదు. ఇక ఏ గూటి పక్షలు ఆ గూటికే చేరుతాయనే సామెతని నిజం చేస్తూ.. ఒకే గూటికి కత్తిమహేష్‌, వర్మలు చేరారని చెప్పవచ్చు. 

Kathi Mahesh Supports RGV GST:

Kathi Mahesh Tweets on RGV God SEX and Truth
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES