చిరంజీవి మరోసారి సినిమాలలోకి వచ్చినా కూడా 60ఏళ్లు దాటిన వయసులో ఎక్కువగా చిత్రాలు చేయకపోవచ్చు. మరోవైపు చిరంజీవితో సరిసమానమైన క్రేజ్ ని తెచ్చుకుని రెండు తరాలకు ప్రతినిదిగా మారి, ఒకానొక సమయంలో చిరంజీవి వేదిక పైనే ఉన్నా కూడా పవర్‌స్టార్.. పవర్‌స్టార్ నినాదాలతో వేడుకలు మార్మోగిపోయాయి. ఇక పవన్ అంతటి క్రేజ్‌ని తెచ్చుకుని తన ఫ్లాప్‌చిత్రం కూడా 50కోట్లను దాటగలదని తన సత్తాచాటాడు. ఇక తాజాగా పవన్ మాట్లాడుతూ, సినిమాలు ముగిసిపోయిన అధ్యాయమని తెలిపాడు. కానీ 'సరైనోడు' ఫంక్షన్‌లో పవన్ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి, మెగా తోకతో స్టైలిష్ స్టార్‌గా ఎదిగిన బన్నీ 'చెప్పను బ్రదర్' అని వ్యాఖ్యానించి పవన్ ఫ్యాన్స్, మెగాభిమానుల మద్దతుని బాగా పోగొట్టుకున్నాడు.
మరోవైపు పవన్ సినిమాలకి నో అని చెప్పడంతో తదుపరి మెగా వారసుడు ఎవరు అనే విషయంలో చర్చోపచర్యలు సాగుతున్నాయి. ఈ స్థానం కోసం రామ్‌చరణ్, బన్నీల మద్య తీవ్రమైన పోటీ ఉండటం ఖాయం. వాస్తవానికి యావరేజ్ కంటెంట్ చిత్రాలతో కూడా హిట్స్ కొడుతూ, విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ మెగాభిమానుల కంటే కూడా తనకంటూ ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని బన్నీ ఏర్పరచుకున్నాడు. అదే ఆయన పవన్ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి 'చెప్పను బ్రదర్' అనే వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే ఈ విషయంలో నేడు బన్నీదే పైచేయి అయ్యేది. కానీ బన్నీకి పవన్ ఫ్యాన్స్, మెగాఫ్యాన్స్‌లో కన్నింగ్ అనే పేరు స్ధిరపడిపోయింది. ఏదో నోటి వెంట కోపంతో వచ్చిన మాటలుగా బన్నీ పవన్ ఫ్యాన్స్‌ని సముదాయించే పని చేయలేదు. చిరంజీవి చెప్పినా కూడా సారీ చెప్పలేదు.
ఇక సమయం, సందర్భం వచ్చినప్పుడు తన భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని అయినా సమయానుకూలంగా పవన్ రాజకీయాలలోకి వెళ్లిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీటైనా పెట్టకపోవడం బన్నీ ఆలోచనకు అర్ధం పడుతోంది. ఆయన పవన్, ఆయన ఫ్యాన్స్ మీద ఇప్పటికీ అదే స్థాయి కోపంలో, సారీ చెప్పేది లేదని, కనీసం పవన్‌కి బెస్టాఫ్‌లుక్ చేప్పే ఉద్దేశం కూడా ఆయనకు లేదని స్పష్టమవుతోంది. ఇక సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే బన్నీ గానీ ఆయన సోదరుడు అల్లు శిరీష్‌కూడా పవన్ యాత్రను పట్టించుకోకపోవడం, ఆ దిశగా అల్లుఅరవింద్ కూడా చొరవ తీసుకోని పరిస్థితి ఉంది.
మరోవైపు చరణ్, సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్‌లు మాత్రం పవన్‌కి బెస్టాఫ్ లక్ చెప్పారు. మరి ఈ పరిస్థితుల్లో పవన్ అభిమానులు రామ్‌చరణ్‌నే ఎక్కువ ప్రోత్సహించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ అవకాశాన్ని రామ్‌చరణ్ ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటాడో వేచిచూడాల్సివుంది! ఆయన నిర్మాణ బాధ్యతలను పక్కనపెట్టి ఎక్కువగా చిత్రాలు చేస్తే మెగా పేరుతో తోకను తగిలించుకుని లబ్ది పొందుతున్నవారికి చెక్ చెప్పినట్లు అవుతుంది...!