Advertisement
Google Ads BL

'భరత్ అనే నేను' రికార్డ్స్ మొదలైనాయ్!


టాలీవుడ్ లో ప్రస్తుతం 'భరత్ అనే నేను' సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ వరసగా రెండు సినిమాలు ప్లాప్ అయ్యిన ఈ సినిమాపై ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించడం లేదు. మహేష్ - కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు మాములుగా లేవు.

Advertisement
CJ Advs

'భరత్ అనే నేను' సినిమా విడుదల దగ్గర పడేకొద్దీ ఏదో ఒక రికార్డు నమోదు అవుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ లో నిర్మాతకీ 70 - 80% వచ్చాయని తెలుస్తోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో రైట్స్ లహరి మ్యూజిక్ వారు ఓ పెద్ద అమౌంట్ కి కొనుక్కున్నట్లు తెలుస్తుంది. ఇక రీసెంట్ గా శాటిలైట్ హక్కుల ధర రికార్డ్ సృష్టించింది.

ఇప్పటివరకు మహేష్ సినిమాల్లో ఏ సినిమాకి రానంతగా అన్ని బాషలలో కలిపి స్టార్ మా రూ.39 కోట్లకు దక్కించుకుంది. అలానే డిజిటల్ హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. సినిమా బడ్జెట్ లో దాదాపు 75% రికవర్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే చాలు సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Mahesh Babu Bharath Ane Nenu Audio Rights Record:

Mahesh Babu and Koratala Siva Movie Bharath Ane Nenu Records starts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs