Advertisement
Google Ads BL

సంగీత సంచలనం ఇద్దరు లెజెండ్స్‌ మెప్పును పొందాడు!


రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ త్వరలో హీరోగా నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అవి ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇక గతేడాది దేవిశ్రీప్రసాద్‌ 'ఖైదీనెంబర్‌ 150, నేను లోకల్‌, రారండోయ్‌ వేడుకచూద్దాం, జయజానకి నాయకా, జై లవకుశ, డిజె, ఉన్నది ఒక్కటే జిందగీ, ఎంసీఏ' వంటి చిత్రాలన్నింటికీ సంగీతం అందించడం ఒక ఎత్తేతే ఆయా చిత్రాలన్నీ మ్యూజికల్‌ హిట్స్‌గా నిలవడం మరో ముఖ్యాంశం. ఇక ఈ ఏడాది ఆయన 'భరత్‌ అనే నేను' మహేష్‌ వంశీ పైడిపల్లితో చేయబోయే 25వ చిత్రం, రామ్‌చరణ్‌, బోయపాటిల చిత్రంతో పాటు సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నటిస్తున్న 'రంగస్థలం 1985'కి కూడా సంగీతం అందిస్తున్నాడు. తమిళంలో విక్రమ్‌-హరి కాంబినేషన్‌లో రూపొందుతున్న 'సామి 2'కి సంగీతం అందిస్తున్నాడు. మరో అరడజను చిత్రాలు వెయిటింగ్‌లో ఉన్నాయి.

Advertisement
CJ Advs

ఇక ఇటీవల దక్షిణ భారత నటీనటుల సంఘం మలేషియాలో నిర్వహించిన క్రికెట్‌ పోటీలు, సినీ వేడుకలకు దేవిశ్రీ హాజరై వేదిక మీద ఆడిపాడి అలరించాడు. ఈ వేడుకలో ముందు సీట్లలో రజనీ, కమల్‌హాసన్‌ కూర్చుని ఉన్నారని, తన షో అయిపోగానే వారిద్దరు లేచి చప్పట్లు కొట్టి తనను అభినందించడం, వారి మధ్యలో కూర్చుని ఫోటో దిగడం మరిచిపోలేని అనుభూతి అని దేవిశ్రీ ప్రసాద్‌ చెప్పుకోచ్చాడు. ఇక దేవిశ్రీనే తెలుగులో 'ఖైదీనెంబర్‌ 150' ద్వారా వరుసగా పాటల సింగిల్‌ ట్రాక్‌లను విడుదల చేయడం దేవిశ్రీ ద్వారానే మొదలైంది. ఇప్పుడు అందరూ అదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. అదే విధంగా లిరికల్‌ వీడియోలలో సాంకేతిక వర్గం, సంగీత కళాకారులు, గ్రాఫిక్స్‌, కాన్సెప్ట్‌ని చెప్పడం కూడా దేవిశ్రీ మొదలుపెట్టిన ట్రెండేనని చెప్పాలి. మరి ఈ నూతన ఏడాదిలో ఈయన మరెన్ని సంచలనాలను నమోదు చేస్తాడో వేచిచూడాల్సివుంది.

DSP Happy with Rajini and Kamal statements:

Rajinikanth and Kamal Haasan Praises Music Sensation DSP  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs