Advertisement
Google Ads BL

గిఫ్ట్స్ ఇచ్చింది- సావిత్రి బాటలో కీర్తిసురేష్‌!


ప్రస్తుతం కీర్తిసురేష్‌ సావిత్రి బయోపిక్‌ 'మహానటి'లో సావిత్రి పాత్రను పోషిస్తోంది. ఇక నాటి సావిత్రికి ఏదైనా చిత్రం పూర్తయితే యూనిట్‌ సభ్యులకు బహుమతులు ఇవ్వడం అలవాటు. ఇక 'మహానటి' నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రారంభమై 8 నెలలు అవుతోంది. ఈ సందర్బంగా కీర్తిసురేష్‌కి యూనిట్‌ సభ్యులతో మంచి సత్సంబంధాలు ఏర్పడ్డాయి. దాంతో ఆమె యూనిట్‌ మెంబర్స్‌ కోసం బంగారు నాణేలను తెచ్చి యూనిట్‌లోని అందరికీ ఇచ్చింది.

Advertisement
CJ Advs

ఇక ధనుష్‌, సూర్య, విజయ్‌ వంటి హీరోలు కూడా తమ చిత్రం షూటింగ్‌ పూర్తయిన తర్వాత యూనిట్‌లోని అందరినీ ఇంటికి పిలిచి భోజనాలు పెడుతుంటారు. చివరకు లైట్‌బోయ్‌ని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా వారు యూనిట్‌లోని అందరికీ గిఫ్ట్స్‌ ఇస్తారు. ఇప్పుడు కీర్తిసురేష్‌ కూడా ఇదే బాటలో ప్రయాణిస్తోంది. ఇక ఇటీవల 'మెర్సల్' చిత్రం సమయంలో విజయ్‌ కూడా తన యూనిట్‌కి బంగారు నాణేలను గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. 'మహానటి' చిత్రం షూటింగ్‌ పూర్తి కావస్తోంది. ఇందులో జెమిని గణేషన్‌గా దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తుండగా, జమున పాత్రలో సమంత నటిస్తోంది.

మరోవైపు ఇందులో ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు నటిస్తుండగా, ఏయన్నార్‌గా విజయ్‌ దేవరకొండ నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్‌ పాత్రను జూనియర్‌ ఎన్టీఆర్‌తో చేయించాలని ప్రయత్నించినా వీలుకాలేదు. దాంతో స్వప్నాదత్‌, డైరెక్టర్‌ నాగ్‌అశ్విన్‌లతో గతంలో 'ఎవడే సుబ్రహ్మణ్యం'లో హీరోగా నటించిన నాని చేత ఎన్టీఆర్‌ పాత్రను చేయించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాది అన్ని భాషల్లో విడుదల అయ్యే చిత్రం కావడం, ఎన్టీఆర్‌ పాత్ర చిత్రీకరణకు కూడా కేవలం రెండు మూడు రోజులే పడుతుండటంతో నాని కూడా దీనికి ఓకే చెప్పే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

Keerthy Suresh gifts gold coins:

Keerthy Suresh Gifts Gold Coins To Mahanati Movie Team
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs