ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'అజ్ఞాతవాసి, జైసింహా, గ్యాంగ్, రంగుల రాట్నం' వంటి నాలుగు చిత్రాలు పెద్ద విజయం సాధించలేకపోయాయి. ఇక 'అజ్ఞాతవాసి' చిత్రం డిజాస్టర్ అయింది. 'రంగుల రాట్నం' సోదిలో లేకుండా పోయింది. 'జై సింహా, గ్యాంగ్' మాత్రమే యావరేజ్ టాక్‌ని సాధించాయి. ఇక తమిళ వాసనలు ఎక్కువగా ఉండటం, సినిమా సబ్జెక్ట్ యూనివర్శల్ కాకపోవడంతో టాక్ బాగానే వచ్చినా కలెక్షన్లు పరంగా 'గ్యాంగ్' పెద్దగా వసూళ్లు సాధించలేదు. ఇక 'జై సింహా' క్లాస్ ప్రేక్షకులకి సహనంగా మారినా, మాస్‌లో బాలయ్యకి ఉన్న క్రేజ్ దృష్ట్యా బిసీ సెంటర్లలో బాగానే కలెక్షన్లు సాధిస్తోంది.
ఇక ఈ చిత్రం 50కోట్ల క్లబ్‌లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలో బాలయ్య మాట్లాడుతూ, తన చిత్రం ఎంత పెద్ద విజయం సాధించదని నేను పట్టించుకోను. సినిమా పరిశ్రమ బాగుండాలనేదే నా కోరిక, నా చిత్రాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తేదీలను నేను పట్టించుకోను. నా సినిమాలన్ని రికార్డులు సృష్టించిన చిత్రాలే. 'సమరసింహారెడ్డి' చిత్రం ఏకంగా 32 కేంద్రాలలో సిల్వర్‌జూబ్లీ జరుపుకుంది. అది ఆల్‌ఇండియా రికార్డు, ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఏ సినిమా ఎంత వసూలు చేసిందన్న లెక్కలు నాకు గుర్తుండవు. వాటిని నా అభిమానులైతే చెప్పగలరు. 'జైసింహా' విషయంలో డిస్ట్రిబ్యూటర్లు, పంపిణీదారులు ఎంతో సంతోషంగా ఉన్నారు అని చెప్పుకొచ్చాడు.
అయితే బాలయ్య నటించిన 'జైసింహా' కూడా పెద్ద స్థాయి విజయం ఏమీ కాదు. నాడు వచ్చిన 'డిక్టేటర్' తరహా టాక్, ఆ సినిమా మోస్తరు కలెక్షన్లను మాత్రమే ఈ చిత్రం సాధిస్తోంది. కానీ ఎవ్వరూ కూడా 'జైసింహా' ఫ్లాప్ అని బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. ఈ విషయంలో 'భాగమతి' వేడుక సందర్భంగా నాని చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఏ చిత్రం కూడా బాగాలేదు. అనుష్క నటించిన 'భాగమతి'తో 2018లో మొదటి బ్లాక్‌బస్టర్‌ని సాధిస్తుందని స్పష్టంగా చెప్పాడు. నాని మాటలు నిజమే. నేచురల్‌స్టార్ తాను ఓపెన్‌గా మాట్లాడటంలో కూడా ముక్కుసూటిగా ఉంటాడని ఈ వ్యాఖ్యలు వింటే అర్దమవుతుంది!