Advertisement
Google Ads BL

వర్మ ఆందోళనకారులను కొడుతున్నాడు!


రాంగోపాల్‌వర్మకి వివాదం అనేది పర్యాయపదం. ఈయనలా మన దేశంలోని ప్రాధమిక హక్కులను పూర్తిగా వినియోగించుకుంటున్నవారు మరెవ్వరూ లేరని చెప్పవచ్చు. ఇక ఇంతకు ముందు వరకు జనాలలో 'మనిషివా మోహన్‌బాబువా' అనే నానుడి ఎక్కువగా ఉండేది. అది ఇప్పుడు 'మనిషివా.. వర్మావా' అనేంతగా మారిపోయింది. ఆయన తన మాటలే కాదు తన భావాలను కూడా ఏమాత్రం సంకోచం లేకుండా వెల్లడిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన నాగ్‌తో సినిమా చేస్తూనే మరోవైపు 'కడప' వెబ్‌సిరీస్‌తో పాటు జీఎస్టీ 'గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌' అనే వీడియా చిత్రాన్ని కూడా తీస్తున్నాడు. ఆయన ఎలాంటి వివాదాస్పద కథాంశాలను ఎంచుకుంటారో వాటి పబ్లిసిటీని కూడా తనదైన శైలిలో చేస్తుంటాడు.

Advertisement
CJ Advs

ఇక వర్మ తన కాలేజీ రోజుల్లో కరాటే ఫైటర్‌ అన్న విషయం కొందరికే తెలుసు. మరోవైపు ఈ జీఎస్టీ చిత్రం జనవరి 26న రిపబ్లిక్‌డేని టార్గెట్‌ చేస్తూ ఉదయం 9గంటలకు విడుదల చేయనున్నాడు. ఇక ఈనెల 25వ తేదీన విడుదల కానున్న 'పద్మావత్‌' చిత్రం విషయంలో పలువురు సినిమా విడుదల కాకూడదని అందోళననలు చేస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలలో పలు మహిళాసంఘాలు అదే తరహాలో వర్మ తీస్తున్న 'గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌'పై కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా తన చిత్రానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న వారిని తన కరాటే ప్రావీణ్యంతో వర్మ వారిని చితకొడుతున్నట్లుగా ఓ ఇమాజినరీ వీడియోను రూపొందించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఏది చేసినా వర్మ తనదైన శైలిలో చేస్తాడని ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది!

Varma Fighting Video Sensation in Social Media:

Ram Gopal Varma Fights 'Imaginary Protestors'
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs