Advertisement
Google Ads BL

నాగ్ - వర్మ 'శపథం' చేస్తున్నారా?


కొంత కాలం లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ హల్చల్ చేసిన వర్మ ఇప్పుడు తాను తీస్తున్న జీఎస్టీ మీద మహిళా సంఘాల నుండి వ్యతిరేఖత ఎదుర్కొంటున్నాడు. నిత్యం వివాదాలతో సహవాసం చేసే రామ్ గోపాల్ వర్మ ఆ మధ్యన ఎటువంటి వివాదాల జోలికి పోకుండా కామ్ అయ్యేసరికి... అందరూ వర్మ ఇలా సైలెంట్ అవడానికి కారణం నాగార్జున అనుకున్నారు. అలా అనుకోవడానికి కారణం వుంది. నాగార్జున పెద్దగా వివాదాలజోలికి పోడు. ప్రస్తుతం బ్యాడ్ పొజిషన్ లో ఉన్న రామ్ గోపాల్ వర్మని శివ సినిమా వంటి హిట్ ఇచ్చాడనే అభిమానంతోనో ఎందుకో గాని... పిలిచి మరీ ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమాకి శ్రీకారం చుట్టాడు నాగ్.

Advertisement
CJ Advs

ఇప్పటికే 10  రోజుల పాటు మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది. అయితే తన సినిమా కంప్లీట్ అయ్యేవరకు వర్మని నోరెత్తకుండా నాగ్ చేశాడనే రూమర్స్ సోషల్ మీడియాలో  వినబడ్డాయి. కానీ వర్మ మాత్రం కుక్కతోక వంకర అన్నట్టుగా తన పాత నైజాన్ని ప్రదర్శిస్తూ నిత్యం మీడియాలో కనబడుతున్నాడు. అయితే సెకండ్ షెడ్యూల్ జరుపుకోనున్న నాగ్ - వర్మ ల సినిమాకి ఇంకా టైటిల్ సెట్ చెయ్యలేదు. మొన్నటిదాకా సిస్టమ్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ప్రస్తుతానికి నాగార్జున - వర్మ సినిమా టైటిల్ 'శపథం' అని.. దానికి ట్యాగ్ లైన్ గా ‘రివెంజ్ కంప్లీట్స్’ గా అనుకుంటున్నారట. మరి అప్పట్లో నాగ్ సిస్టమ్ టైటిల్ ని ఖండించాడు. కానీ ఇప్పుడు ఈ శపథం అనే టైటిల్ వాడుకలోకి వచ్చినా దాన్ని చిత్ర బృందం ఎక్కడా ఖండించడం లేదు. అంటే నాగ్ - వర్మ సినిమాకి దాదాపుగా 'శపథం' అనే టైటిల్ ఖరారైనట్లే అంటున్నారు. చూద్దాం ఫైనల్ గా ఎటువంటి టైటిల్ ని నాగ్ - వర్మలు తీసుకుంటారో అనేది.

Nagarjuna and RGV Movie Title Revealed:

Sapadham is The Nag and RGV movie Title
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs