కత్తిమహేష్, పవన్ ఫ్యాన్స్ మధ్య ఏర్పడిన రచ్చ సద్దుమణిగింది. మరోవైపు ఈ వివాదంలో వేలు పెట్టి కత్తిమహేష్ చేత పూనమ్‌కౌర్ పవన్‌తో సంబంధాలు, ఒకే గోత్ర నామాలతో పూజలు చేయించడాలు, పవన్ ద్వారా ఏపీకి చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం వంటి విషయాలలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయినా ఆమె మహిళ కావడంతో ఆమెతో అలా మాట్లాడవద్దని పలువురు కత్తి మహేష్‌కి సూచించారు. ఇక ఈమె తన స్నేహితులతో కత్తి మహేష్‌తో పవన్ ఫ్యాన్స్‌కి రాజీ కుదిరిన వారం ముందే ఈ వివాదం మరో పదిరోజుల్లో సమసిపోతుందని చెప్పిందట. ఆమె మాట ప్రకారమే ఈ వివాదం ఒకేవారం రోజుల్లో సమసి పోవడంతో ఆమె స్నేహితులు ఆశ్చర్యపోయారట. అంత ఖచ్చితంగా, కరెక్ట్‌గా పూనమ్ ఎలా చెప్పగలగింది? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో ఆమెకి ముందుగా తెలియబట్టే ఆ విధంగా ఖచ్చితంగా చెప్పగలిగిందని ప్రచారం సాగుతోంది.
మరోవైపు పూనమ్ కౌర్ తాజాగా మరో ట్వీట్ చేసి పవన్ ఫ్యాన్స్, కత్తిమహేష్‌ల వివాదాన్ని మరలా కెలుకుతోంది. ఆమె ట్వీట్ చేస్తూ, పవిత్రంగా ఉండాలి అనే ఆలోచన ఓ శక్తి, అది దైవత్వం కన్నా గొప్పది. అదే పీకే ప్రేమ. ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? నన్ను విబేధిస్తూ ఎవరైనా ముందుకు వస్తారా? అని ప్రశ్నించింది. ఇక ఈ ట్వీట్‌పై పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుంటే.... మరికొందరు మాత్రం ముగిసిపోయిన రచ్చను మరలా కెలకవద్దు అంటున్నారు. మొత్తానికి హీరోయిన్‌గా ఫేడవుట్ అయిన పూనమ్‌కౌర్ పవన్, కత్తి మహేష్ వివాదం ద్వారా మరలా వార్తల్లోకి వచ్చి, పవన్ అభిమానుల మద్దతు కూడగట్టుకోవడంతో ఆమెకి మరలా సినిమా ఛాన్స్‌లు వస్తాయేమో వేచిచూడాల్సివుంది.