Advertisement
Google Ads BL

బన్నీ నా పేరు సూర్యతో అమేజింగ్ ఫీట్!


రోజు రోజుకి టాలీవుడ్ మార్కెట్ పెరుగుతూ వెళ్ళిపోతోంది. మొన్నటి వరకు సినిమాలు బాగా కలెక్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ స్క్రీన్స్ పెంచి రికవరీ చేసుకునేవాళ్లు మేకర్స్. అయితే ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల మార్కెట్ పెంచేందుకు ఓ ట్రెండ్ నడుస్తుంది. సినిమాను అత్యథిక భాషల్లో విడుదల చేయడం.

Advertisement
CJ Advs

మొన్నటికి మొన్న 'స్పైడర్' సినిమా విషయంలో అదే చేశారు. త్వరలో 'రోబో 2.0' సినిమా విషయం కూడా అదే చేస్తున్నారు. అలానే ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' సినిమాను ఏకంగా 7భాషల్లో విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ బన్నీ నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠి, భోజ్ పురి భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'నా పేరు సూర్య' యూనివర్సల్ సబ్జెక్ట్ అంట.. అందుకే ఎక్కువ భాషల్లో రిలీజ్ చేస్తున్నాం అని మేకర్స్ చెబుతున్నారు. ప్రయత్నం బాగానే ఉంది కానీ ప్రచారం ఎలా అన్నది ఆలోచించుకుంటే మంచిది.

Allu Arjun Naa Peru Surya Releasing in Seven Languages:

NPS is expected to hit the screens at a time in Telugu, Tamil, Malayalam, Hindi, Bengali, Marathi and Bhojpuri languages.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs