Advertisement
Google Ads BL

రెబెల్‌ లేడీ అంటే ఈవిడే....!


దక్షిణాదికి ఖుష్బూగా ఎంటర్‌ అయిన ఆమె జీవితం వెంకటేష్‌ హీరోగా పరిచయం అయిన 'కలియుగ పాండవులు' చిత్రంలో హీరోయిన్‌గా మెప్పించింది. నాడు ఆమెకి ఓ తెలుగుస్టార్‌తో కూడా ఎఫైరు ఉందని ప్రచారం జరిగింది. తర్వాత కోలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. తమిళనాట దేవతగా గుళ్లు కట్టించుకుని ఖుష్బూ దుస్తులు, ఖుష్బూ ఇడ్లీ వరకు తయారు చేసే విధంగా తన బ్రాండ్‌ని పెంచుకుంది.

Advertisement
CJ Advs

ఇక ఈమెకి నాటి హీరో, శివాజీగణేషన్‌ కుమారుడు ప్రభుతో ఎఫైర్‌ సంగతి అందరికీ తెలిసిందే. చివరకు ప్రభు జీవితంలోకి ఆమెని రానివ్వకుండా శివాజీగణేషన్‌ తీవ్ర చర్యలే తీసుకున్నాడు. ఇక ఈమె ప్రభుతో నటించిన 'చిన్నతంబి' తర్వాత మాత్రం వారి జంటకు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. తాజాగా ఆమె తన ఇంటి వ్యవహారం గురించి మాట్లాడుతూ, మా నాన్నకు మహిళలను గౌరవించడం చేతకాదు. ఎంతో క్రూరంగా మా అమ్మ మీద ప్రవర్తించేవాడు. దాంతో నాకు ఆయనంటే అసలు ఇష్టం ఉండేది కాదు. దాంతో 1986 సెప్టెంబర్‌ 12న మా అమ్మ, సోదరుడిని తీసుకుని ఇంటి నుంచి వచ్చేశాను. పాకుకుంటూ వెళ్లి భిక్షాటన చేసి నీ తల్లిని, సోదరుడిని పోషించుకుంటావా? అని మా నాన్న ఎగతాళిగా అన్నారు.

బతకలేకపోతే అమ్మని, సోదరుడిని చంపేసి నేను కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానే గానీ నీ మొహం కూడా చూడనని చెప్పాను. అన్నట్లుగానే ఇంతకాలం నా తండ్రి మొహం కూడా చూడలేదు. భవిష్యత్తులో చూడను కూడా అని తెలిపింది. ఇక ఈమె తమిళ దర్శకుడు సుందర్‌.సిని వివాహం చేసుకుని తమిళనాట రాజకీయ నాయకురాలిగా కూడా పేరు తెచ్చుకుంది.

Kushboo Talks About her Father :

Kushboo Reveals Shocking Facts About Her Father   
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs