Advertisement
Google Ads BL

బాలయ్య భామ తన భావాలను చెబుతోంది!


'పిల్లజమీందార్‌' తర్వాత తాజాగా 'జైసింహా'లో గ్లామరస్‌ రోల్‌ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్‌ హరిప్రియ. ఇక ఈమె మాట్లాడుతూ, మాది చిక్‌మంగళాపూర్‌కి 40 కిలోమీటర్లు ఉన్న ప్రాంతం. హైస్కూల్‌ చదువు కోసం బెంగుళూరు వచ్చాం. అక్కడ స్కూల్‌, కాలేజీలలో డ్యాన్స్‌లు, నాటకాలు, ఫ్యాషన్‌ షోలలో పాల్గొనే దానిని, ఓసారి కాలేజీ ఫెస్టివల్‌లో ప్రదర్శన చేసిన నా గురించి ఓ పత్రికలో ఆర్టికల్‌ వచ్చింది. దానిని చూసిన దర్శకుడు ఒకరు నాకు 'తుళు' చిత్రంలో అవకాశం ఇచ్చాడు.

Advertisement
CJ Advs

ఇక తెలుగులో 'తకిట తకిట' సమయంలో నేను కన్నడని మిక్స్‌ చేసే తెలుగును మాట్లాడుతూ ఉండేదాన్ని, నా మాటల తీరు చూసి అందరూ టీజ్‌ చేసేవారు. ఫలానా పదానికి అర్ధం ఏమిటి? ఫలానా పదానికి ఆర్దం తెలుసా? అని ఏడిపించేవారు. తర్వాత తెలుగు నేర్చుకున్నాను. ఇక నేను నా వద్దకు వచ్చే కథలు, పాత్రలు విని నచ్చితేనే ఓకే చేసేదానిని. 'అబ్బాయి క్లాస్‌.... అమ్మాయి మాస్‌', 'ఈ వర్షం సాక్షిగా' సినిమాల విషయంలో కూడా అదే చేశాను.

అయితే వాటిని తెరపై చూసినప్పుడు నాకు కథ, పాత్ర చెప్పినంత గొప్పగా, హృదయాలకు హత్తుకునేలా చిత్రాలను తీయలేకపోయారని భావించాను. దాంతో కథ, నా పాత్రతో పాటు మంచి టీంతో పని చేయడం కూడా ముఖ్యమేనని తెలుసుకున్నాను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది.

Haripriya Interview Highlights:

Haripriya About Her Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs