Advertisement
Google Ads BL

రజనీ గొప్పతనాన్ని చెప్పిన అక్షయ్‌!


బాలీవుడ్‌ స్టార్స్‌లో అక్షయ్‌కుమార్‌ది విభిన్నమైనశైలి. ఏడాదికి మూడు నాలుగు చిత్రాలు చేస్తూ, తాను నటించే చిత్రాల ద్వారా సమాజానికి ఏదో ఒక మెసేజ్‌ ఇస్తూ ఉంటాడు. 'టాయిలెట్‌, ప్యాడ్‌మన్‌'వంటివి దానికి ఉదాహరణ. అలాంటి బాలీవుడ్‌ స్టార్‌ సౌతిండియన్‌ సినిమాలో విలన్‌గా ఒప్పుకోవడం కూడా అరుదే. కాగా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న '2.0'లో అవకాశం వస్తే ఎలా వదులుకుంటానని అక్షయ్‌ అన్నారు.

Advertisement
CJ Advs

ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం విషయంలో వస్తున్న ప్రచారాలలో నిజంలేదు. మేమంతా యూనిట్‌లో భాగం కాబట్టి రిలీజ్‌కి ముందుగా సినిమా విశేషాలను చెప్పే అనుమతి మాకు లేదు. బాలీవుడ్‌లో స్టార్‌వి అయివుండి దక్షిణాది సినిమాలలో విలన్‌గా ఎలా నటిస్తావని అందరూ అడుగుతున్నారు. ఈ చిత్రంలో నటించడం నేను కలలో ఊహించని సంగతి. విలన్‌ ఉంటేనే హీరో ఉంటాడని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ సినిమా చూసినప్పుడు మాత్రం అందరు సర్‌ప్రైజ్‌ కావడం గ్యారంటీ అని భరోసా ఇచ్చాడు. ఇలాంటి చిత్రంలో అవకాశం వచ్చినవెంటనే ఓకే చెప్పేశాను.

ఈ చిత్రం షూటింగ్‌ సందర్భంగా ఓ సంఘటన గుర్తుకు వస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో రజనీకాంత్‌ ప్యాంటుకి మట్టి అంటుకుంది. ఆయన ఎంతో స్టైల్‌గా దానిని దులుపుకుంటూ ఉండటంతో యూనిట్‌ అంతా ప్యాంటు దులుపుకోవడంలో కూడా రజనీ స్టైల్‌ని చూసి అంతా ఆశ్యర్యపోయారు. రజనీ ఏమి చేసిన స్టైల్‌గానే ఉంటుంది. అలాంటి రజనీ చేతిలో విలన్‌గా డెబ్బలు తిన్నందుకు నేను ఆనందంగానే ఉన్నానని తెలిపాడు. ఇక ఆయన నటించిన 'ప్యాడ్‌మన్‌' చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది.

2.0 Villain About Rajinikanth:

Akshay Kumar Talks About Rajinikanth Greatness &nbsp; <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs