డిజే సినిమాలో ఒకే ఒక్క సీన్ తో కుర్రకారులకి దగ్గర అయింది పూజా హెగ్డే. సినిమాలో బికినీలో హాట్ హాట్ గా చూపడంతో యువతకు బాగా దగ్గర అయింది. అంతకు ముందు ముకుందా - ఒక లైలా కోసం సినిమాల్లో నటించినప్పటికీ అందులో ఎక్కడా అంత హాట్ షో చూపించలేదు. డిజేలో ఆ ఒక్క సీన్ యూట్యూబ్ లో 4 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంది అంటేనే అర్థమవుతుంది పూజకి ఎంతమంది కనెక్ట్ అయ్యారో.
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సాక్ష్యంలో హీరోయిన్ గా నటిస్తుంది పూజ. అలానే రామ్ చరణ్ సినిమా రంగస్థలం సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో కూడా నర్తించబోతోంది. ఇలా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న పూజకి ఆఫర్స్ కూడా అలానే వస్తున్నాయి.
ఇక పైన వున్న స్టిల్ చూస్తున్నారుగా. తన బాడీలో ఏది కిక్కిచ్చేదో సరిగ్గా అదే బయటికి హైలైట్ అయ్యేలా లాంగ్ గౌన్ తో పూజా నిలుచున్న స్టైల్ చూస్తే పూజాని తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపించేలా ఉంది కదా. ఈమె 2016 లో హృతిక్ తో మొహెంజొదారో చేసింది అది ప్లాప్ అయింది. సో 'సాక్ష్యం' మీద తన ఆశలన్నీ పెట్టుకుంది.