Advertisement
Google Ads BL

నాని ఎందుకు వెనకాడుతున్నాడు..?


నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా వరుసగా ఎనిమిది విజయాలు దక్కించుకుని కెరీర్ లో ఎన్నడూ లేనంత ఫామ్ లో ఉన్నాడు. ఈ ఊపులో ఏడాదికి కనీసం మూడు చిత్రాలు పూర్తి చేస్తూ తన బాక్సాఫీస్ క్రెడిబిలిటీని చిత్రం చిత్రానికి పెంచుకుంటున్నాడు. మరో వైపు వాల్ పోస్టర్స్ సినిమా అనే కొత్త నిర్మాణ సంస్థ స్థాపించి తానే తన అభిరుచికి తగ్గ కథలని వెండితెరపైకి తీసుకురావటానికి నిర్మాతగానూ మారాడు.

Advertisement
CJ Advs

నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నానిని అమితంగా ఆకర్షించటంతో తన బ్యానర్ లోనే ఆ చిత్రాన్ని నిర్మించి 'అ!' అనే టైటిల్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా కాసాండ్రా, ఈషా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి వంటి నోటేడ్ స్టార్ కాస్ట్ తో పాటు మాస్ మహారాజ రవితేజ వాయిస్ ఓవర్ సినిమాలో ఉన్నప్పటికీ సినిమాని ముందుగా అనుకున్న ఫిబ్రవరి తొలివారం విడుదల చేయటానికి వెనకాడుతున్నారు నాని. ఫిబ్రవరి తొలి రెండు శుక్రవారాలలో ఛలో, ఇంటెలిజెంట్, తొలిప్రేమ, గాయత్రి, కిరాక్ పార్టీ వంటి చిత్రాలు విడుదల కానుండటంతో మంచి కంటెంట్ ని అన్ని సినిమాల మధ్య వదలడం కంటే కొంత కాలం ఆగి సేఫ్ రిలీజ్ చేసుకోవటం ఉత్తమం అని ప్లాన్ చేస్తున్నాడు నాని.

Nani Awe Movie Postponed:

Hero Nani back step on Awe Movie Release 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs