Advertisement
Google Ads BL

సాయి పల్లవి వినదంటే వినదంతే..?!


స్టార్ హీరో లేదంటే స్టార్ డైరెక్టర్ ఎవరైనా పిలిచి అవకాశం ఇస్తే..  హీరోయిన్స్ ఏం ఆలోచించకుండా వెంటనే చేసేస్తారు. కానీ సాయిపల్లవి మాత్రం స్టార్ హీరో అయితే ఏంటి.. స్టార్ డైరెక్టర్ అయితే ఏంటి? తనకు కథ, పాత్ర నచ్చితేనే చేస్తా అంటుంది. దర్శకుడు లేదా హీరోపై అభిమానంతో అవకాశాన్ని వదులుకోకుంటే త్వరగా కనుమరుగు అయిపోవాల్సి వస్తుందని చెబుతుంది.

Advertisement
CJ Advs

సదరు దర్శకుడు లేదా హీరోతో మళ్లీ చేసే అవకాశం ఉంటది. కానీ ఒక్కసారి రాంగ్ స్టెప్ వేస్తే కథ విషయంలో మళ్లీ పైకి లేవలేమని చెబుతుంది ఈ మలయాళ ముద్దుగుమ్మ. దిల్‌ రాజు నిర్మాణంలో వరుసగా రెండు సినిమాలు చేసిన సాయిపల్లవి అతనితో మరో చిత్రానికి నో చెప్పింది. అందుకు పెద్ద కారణం ఏమి లేదంట.. స్టోరీ నచ్చకే అలా రిజెక్ట్ చేశానని చెబుతుంది. అలానే మణిరత్నం అంటే పడి చచ్చిపోయే సాయిపల్లవి.. మణి చిత్రానికి కూడా నో చెప్పింది.

ఇలానే స్టార్ హీరో విక్రమ్ సరసన నటించే అవకాశాన్ని చేజేతులా వదులుకున్న సాయిపల్లవి.. అతని పక్కన బలమైన పాత్ర లేకపోతే తేలిపోతానని, దానికంటే అవకాశాన్ని వదులుకోవడమే మంచిదని చెప్పింది. మరి ఇలా వచ్చిన ఆఫర్స్ ని రిజెక్ట్ చేసుకుంటూ పోతే ఇంకా సినిమాల్లో ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉండవని, ఇక ఖాళీగా కూర్చోవటమే అని ఫిలింనగర్ ప్రేక్షకులు సాయిపల్లవికి సలహాలు ఇస్తున్నారు. 

Sai Pallavi Rejected One More Big Chance:

Sai Pallavi Says No To Vikram Movie Chance
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs