Advertisement
Google Ads BL

సురేష్ బాబు మాట వినరా..?


నెల రోజులు కిందటే ఓ ప్రెస్ మీట్ పెట్టి సురేష్ బాబు తెలుగు సినిమాల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్ అయిన నెల రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్ లాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్ ల్లో సినిమా వచ్చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రేక్షకులు థియేటర్స్ కి దూరమైపోతున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
CJ Advs

ఇది ఇలానే జరిగితే ఇంక జనాలు థియేటర్స్ కి రావటం మానేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ల్లో సినిమాలు ప్రదర్శించడానికి కొంచెం వేచి చూసే ధోరణి ఉండాలని.. ఈ విషయంలో నిర్మాతలు ఆలోచించాలని కోరారు. అయితే సురేష్ బాబు చెప్పిన ఈ మాటలు ఏ ప్రొడ్యూసర్స్ పట్టించుకోవట్లా. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత కూడా సురేష్ బాబు మాట లెక్క చేయట్లా.

ఆయన సమర్పణలో వచ్చిన ‘జవాన్’ సినిమా విడుదలైన నాలుగు వారాల్లోపే అమేజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ఈ సినిమా అంతగా ఆడలేదు కాబట్టి ఒకే అనొచ్చు. కానీ ‘ఎంసీఏ’ నెల తిరక్కుండానే అమేజాన్లో రిలీజైపోయింది. ఈ చిత్రం ఇంకా థియేటర్లలో ఉండటం.. మొన్న సంక్రాంతి సీజన్లో దీనికి మంచి వసూళ్లు కూడా రావడం గమనార్హం. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతే సురేష్ బాబు మాటలు పట్టించుకోలేదు.. ఇంకా మిగతా నిర్మాతలు ఏం పట్టించుకుంటారు.

Suresh Babu Serious on Digital Mafia:

Dil Raju neglects Suresh Babu speaks
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs