Advertisement
Google Ads BL

అజ్ఞాతవాసి కష్టాలు మహేష్ కి కూడానా?


టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోలని భయపెట్టే విషయం వేరే సినిమాలని కాపీ కొడుతున్నారని. దర్శకులు హీరోలని బాగా ఇంప్రెస్స్ చేసి కథను ముందుకు తీసుకువెళ్లిన తర్వాత అది కాపీ అని నిందలు పడుతుండడంతో తట్టుకోలేకపోతున్నారు. అందుకు ఉదాహరణ మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా 'అజ్ఞాతవాసి'. ఈ సినిమా ఫ్రెంచ్ మూవీ నుండి కాపీ కొట్టి తీశారని వార్త వచ్చింది. సినిమా రిలీజ్ టైంలో త్రివిక్రమ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement
CJ Advs

ఇప్పుడు అలాంటి సమస్య మహేష్ బాబుకి కూడా ఎదురయ్యేలా ఉందని రూమర్స్ వస్తున్నాయి. మహేష్ కెరీర్లో ఎప్పుడు లేని విధంగా ఒక హాలీవుడ్ ఆధారంగా తెరకెక్కిన కథలో నటిస్తున్నాడు అని టాక్ వినిపిస్తోంది. అది కూడా కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న 'భరత్ అనే నేను' కథనే. వాస్తవానికి ఈ కథ కొరటాల రాసుకున్నది కాదు. 'శ్రీహరి నాను' అనే రచయిత నుంచి కొరటాల 'భరత్ అనే నేను' కథని తీసుకున్నాడు. అయితే అతను 90 లలో వచ్చిన ఒక హాలీవుడ్ కథ ఆధారంగా ఈ కథను అల్లినట్లు ఫిల్మ్ నగర్ లో రూమర్స్ వస్తున్నాయి.

ఈ ఇంగ్లీష్ సినిమా కథ ఏం మార్చకుండా అలానే తీస్తున్నారని టాక్ ఉంది. మరి అలానే తీస్తే త్రివిక్రమ్ ఎదుర్కొన్న సమస్యలే కొరటాల కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రీమంతుడు తరువాత అదే కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి  బిజినెస్ ఓ రేంజ్ లో ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ 'అజ్ఞాతవాసి' లానే ఈ సినిమాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుందా అని ఓ వర్గం వారు చర్చించుకుంటున్నారు. మరి ఎలాంటి పరిణామాలు ఎదురావుతాయో చూడాలి.

Copy Rumours on Mahesh Babu BAN:

After Agnathavasi, Mahesh BAN Faced Copy Rumours
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs