Advertisement
Google Ads BL

యంగ్‌ మేనత్తను కాదంటోంది...!


యాంకర్లుగా వచ్చిన సుమ, ఝాన్సీ, ఉదయభాను వంటి వారు వెండితెరపై కూడా తళుక్కుమన్నారు. ఇక ఈ తరంలో కూడా రేష్మి, శ్రీముఖి, అనసూయ వంటి వారు బుల్లితెరపై, వెండితెరపై కూడా అవకాశాలను దక్కించుకుంటున్నారు. వీరందరిలోకి ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయది డిఫరెంట్‌ స్టైల్‌. 'అత్తారింటికి దారేది'కి నో చెప్పింది. నాగార్జునతో 'సోగ్గాడే చిన్నినాయనా'లో ఆడిపాడింది. 'క్షణం'లో తన నటనతో మెప్పించింది. 'విన్నర్‌' చిత్రంలో స్పెషల్ సాంగ్ కి సై అంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా డోంట్‌కేర్‌ అంటూ ఇప్పటికీ అవే కురచ దుస్తులు, గ్లామర్‌షోతో 'జబర్దస్త్‌'తో సహా ఎక్కడా తగ్గడం లేదు. దానికి తగట్లుగా ఆమెపై విమర్శలు ఉన్నట్లే ఆమెకి, ఆమె గ్లామర్‌కి యూత్‌లోనే కాదు.. ఫ్యామిలీ ఆడియన్స్‌లో కూడా క్రేజ్‌ ఉంది. దీంతో తనకు తాను సినిమా అవకాశాలను కూడా ఆమె సృష్టించుకుంటోంది.

Advertisement
CJ Advs

తాజాగా ఆమె సోషల్‌మీడియాలో అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 'అనసూయ' అనే మీ పేరు అర్ధం ఏమిటి? అంటే అది మహా పతివ్రత అయిన సతీ అనసూయ పేరు అనకుండా 'అసూయ'లేనిది ఈ 'అనసూయ'ని స్పాంటేనియస్‌గా స్పందించింది. మీ బలం ఏమిటి ? అని అడిగితే తన గ్లామర్‌ అని రొటీన్‌గా సమాధానం ఇవ్వకుండా 'నా ఆత్మ'అంటూ ఆత్మబలంలో తానెంత గట్టిదో చెప్పింది.

మరో అభిమాని నాకు పరీక్షలు.. బెస్టాఫ్‌లక్‌ చెప్పండి అంటే బెస్టాఫ్‌లక్‌ చెప్పింది. ఇక రామ్‌చరణ్‌ 'రంగస్థలం 1985'లో మీరు రామ్‌చరణ్‌కి మేనత్తగా నటిస్తున్నారా? అని ప్రశ్నిస్తే 'అసత్యం' అనే ఒకే పదంతో ఈ రూమర్లలంన్నింటినీ కొట్టిపారేసింది. మొత్తానికి అనసూయ మంచి మాటకారే కాదు.. అందరిని ఎలా బుట్టలో పడవేయాలో తెలిసిన గడుసుభామ ... లేదా గడుసు ఆంటీ అని అయినా పిలుచుకోవచ్చు సుమా...!

Anasuya Clarity on Rangasthalam Role :

Anasuya not Aunty in Rangasthalam Movie <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs