గుడ్డు ముందా..కోడి ముందా? అనేది ఎలా ఉన్నా వివాదం ముందా? వర్మ ముందా? అంటే వర్మ అనే చెప్పాలి. ఇక ఆయన ఏమి చేసినా వివాదమే. మౌనంగా ఉన్నా కూడా అది వార్తే అవుతుంది. ఇక వర్మ తనకు నచ్చిన సినిమాలంన్నింటిలో తన కిష్టమైన సీన్స్‌ని కాపీ చేస్తానని ఫ్రాంక్‌గా చెబుతాడు. పైరసీలు చేస్తానని, కాబట్టి తాను పైరసీకి వ్యతిరేకం కాదని అంటాడు. ఆయన తీసిన 'రంగీలా' చిత్రం కె.విశ్వనాథ్ 'సీతామాలక్ష్మి'కి కాపీ. ఇక బ్రూస్‌లీ యాక్షన్ చిత్రాలకు, విజయవాడ రౌడీయిజం కలిపి 'శివ' తీశానని, ధర్మ-రక్ష అనే దర్శకులతో జగపతిబాబు హీరోగా మొదలుపెట్టిన 'రక్తచరిత్ర'బాగా ఆకట్టుకోవడంతో ఆ దర్శకులను తొలగించి, వారు తయారు చేసిన స్క్రిప్ట్‌తోనే 'రక్తచరిత్ర'ను తాను తీశానని చెబుతాడు. ఇక 'సర్కార్ 3' విషయంలో కూడా బాలీవుడ్ రచయిత నీలేష్ తనకి క్రెడిట్ ఇవ్వకుండా మొత్తం వర్మ వాడేశాడని గొంతు చించుకున్నాడు. ఇక 'సర్కార్ 3'కి రచయితగా పనిచేసిన జయకుమార్ తన స్క్రిప్ట్ ఎలా ఉందో చూడమని వర్మకి ఇస్తే దానినే యధాతథంగా 'గాడ్స్ ..సెక్స్ అండ్ ట్రూత్'ని వర్మ తీశాడని ఆరోపణలు చేస్తున్నాడు.
ఇక ఈ విషయంపై వర్మ తేలిగ్గా స్పందించాడు. తానేమీ ఆదాయం కోసం ఓ సినిమాగానో లేక షార్ట్ ఫిలింగానో 'జీఎస్టీ'ని తీయలేదని, ఉచితంగా ఇంటర్నెట్‌లో పెట్టేటప్పుడు అసలు కాపీ రైట్ అనేది ఎలా వర్తిస్తుందని ఎదురు ప్రశ్నిస్తున్నాడు. ఇక 'క్షణక్షణం' తర్వాత ఈ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్'కి కీరవాణి చేత సంగీతం ఇప్పిస్తూ అద్భుతమైన 'బాహుబలి'కి ఆధ్మాత్మిక చిత్రం 'అన్నమయ్య'కి సంగీతం అందించిన కీరవాణి దీనికి సంగీతం అందిస్తున్నట్లు తెలిపాడు. ఇక తాజాగా ఈ జీఎస్టీపై ఆయన మాట్లాడుతూ, దేవుడే సెక్స్‌ని సృష్టించాడని, ఈ విషయంలోనే కాదు నేను ఎవరి విషయంలోనూ లొంగబోనని, తాను సింహం వంటి వాడిని కాదని, దానికన్నా పవర్‌ఫుల్ అని జీఎస్టీపై విమర్శలు చేస్తున్న వారికి చురకలంటించాడు. ఒక్కో విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా ప్రతిస్పందిస్తారని వాటన్నింటిని పట్టించుకుంటే అసలేమీ తీయలేమని చెబుతూ, గాడ్ క్రియేట్ చేసిన సెక్స్‌ని తప్పు అని, ఆడవాళ్లు సెక్స్ విషయంలో మూలన మడిగట్టుకు కూర్చోవాలనేది ప్రజలు విధించిన నిబంధనలని, తాను దీనిపై శక్తివంతంగా చూపిస్తూ దీనిని తీశానని చెప్పుకొచ్చాడు.
మరోవైపు నాగార్జున వర్మతో చిత్రం సమయంలో ఆయన తనతో చిత్రం తీసేటప్పుడు ఇతర సినిమాలు, ఇతర విషయాల గురించి ఆలోచించకుండా తన సినిమా మీదనే దృష్టి పెట్టాలని చెప్పానని కొన్నిరోజుల కిందట నాగ్ చెప్పాడు. కానీ ఇప్పుడు వర్మ మానానికి వర్మని నాగ్ వదిలేశాడనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సిగ్రేడ్ 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' 'కడప' వంటి వాటిని తీసిన వర్మ నాగ్‌తో సినిమా తీస్తే మహిళల్లో చులకన భావం పెరుగుతుందని నాగ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.