Advertisement
Google Ads BL

సూరికి చిరు ఎందుకు నో చెప్పాడు?


'బాహుబలి' తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్ రామ్ చరణ్ చిత్ర టీంతో ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటున్నాడంట. ప్రతి సీన్ ఉన్నతంగా ఉండాలని మొత్తం చిత్ర యూనిట్ వర్క్ చేస్తోంది.

Advertisement
CJ Advs

ఇకపోతే గత నెల డిసెంబర్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. సెకండ్ షెడ్యూల్ కోసం 'సై రా' యూనిట్ అటవీ ప్రాంతాలకి షిఫ్ట్ అవుతుందట. ఈ సినిమాకు మొదటి నుండి ఏదో ఒకటి ఆటంకం వస్తూనే వుంది. ఇటీవల దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన ఒక మాటను చిరు పట్టించుకోలేదని తెలుస్తోంది. అంతే కాకుండా దర్శకుడి ఆలోచనకు చిరు ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్ వినిపిస్తోంది. 

సెకండ్ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ పార్ట్స్ ఉన్నందున..చిరుకు ప్రస్తుతం ఉన్న ఫిట్ నెస్ సరిపోదని.. ఇంకా బాడీని బిల్డ్ చేయాలనీ సురేంద్ర రెడ్డి, చిరుకు చెప్పడంతో.. అందుకు చిరు ఒప్పుకోలేదని చిత్ర యూనిట్ నుంచి కొన్ని ఊహాగానాలు బయటికొచ్చాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఫైట్స్ సీన్స్ ని మాత్రం కొంచెం భారీగా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ కానున్నాయి అని తెలుస్తుంది.

Body Double For Sye Raa:

Chiru-Suri having creative differences
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs