Advertisement
Google Ads BL

ఈ బిరుదుకి మోహన్ బాబు అర్హుడు!


ఇప్పటికే కలెక్షన్‌ కింగ్‌గా పేరున్న మోహన్‌బాబుకి మరో బిరుదు వరించింది. టి.సుబ్బరామిరెడ్డి కళాపరిషత్‌ ఆయనను 'విశ్వనట సార్వభౌమ' బిరుదుతో సత్కరించింది. హైదరాబాద్‌లోని టీఎస్‌ఆర్‌-కాకతీయ మహోత్సవం సందర్భంగా హాజరైన సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మోహన్‌బాబుని శాలువాతో సత్కరించి ఈ బిరుదు ప్రధానం చేశారు. ఇక కళా సేవలో తరిస్తున్న టి.సుబ్బరామిరెడ్డి ధన్యజీవి అని బాలయ్య పొగడగా, అజాత శత్రువు, గొప్ప వ్యక్తి టి.సుబ్బరామిరెడ్డి అని మోహన్‌బాబు ప్రశంసించారు.

Advertisement
CJ Advs

కళాకారులను సత్కరించే సంస్కారం ఉన్న టి.సుబ్బరామిరెడ్డికి శివకటాక్షం మరింతగా కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నానని, ఈ అవార్డుతో సత్కరించిన టీఎస్‌ఆర్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు తన కెరీర్‌లో పడిన కష్టనష్టాలు, ఇబ్బందులు, సంతోషాలను నెమరువేసుకున్నారు. తనకి ఎంతో ఆప్తుడు, మంచి మనసున్న మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు సమక్షంలో ఈ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉందని, ఆయనతో తనకు ఉన్న అనుభవాలను మోహన్‌బాబు సభాముఖంగా గుర్తు చేసుకున్నారు. సో.. కలెక్షన్‌ కింగ్‌ ఇక నుంచి 'విశ్వనట సార్వభౌమ'గా పిలుచుకోవచ్చన్నమాట. ఎంతో టాలెంట్‌ ఉన్న మోహన్‌బాబు నిజంగానే ఈ అవార్డుకి అర్హుడని చెప్పాలి.

Mohan Babu Happy with Viswa Nata Saarvabouma:

Mohan Babu Felicitated by Kakatiya Kala Parishat
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs