Advertisement
Google Ads BL

పవన్ పరిస్థితి ఇలా తయారైందేంటి?


తమ చిత్రాలు సరిగా ఆడకపోతే తాము చేసే తదుపరి చిత్రాలను అవే డిస్ట్రిబ్యూటర్లకి ఇవ్వడం, లేక నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు రెమ్యూనరేషన్‌ని తిరిగి ఇచ్చేసి వారి నష్టాలను పూడడ్చం అనేది రజనీకాంత్‌ స్టార్ట్‌ చేసిన ట్రెండ్‌. దీనికి పవన్‌కళ్యాణ్‌ కూడా తన 'జానీ'తో శ్రీకారం చుట్టాడు. మరోవైపు నాన్‌రిటర్నబుల్‌ అమౌంట్స్‌ కోసం ఇదే అదనుగా డిస్ట్రిబ్యూటర్లు తమ నష్టాలను భర్తీ చేయాలనే దాకా పరిస్థితి వచ్చి కొన్నిసార్లు నిరాహార దీక్షలు, మీడియాకి ఎక్కడం కూడా కామన్‌ అయిపోయింది.

Advertisement
CJ Advs

ఇక పవన్‌ విషయానికి వస్తే తన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'తో దెబ్బతిన్న వారికి 'కాటమరాయుడు', 'కాటమరాయుడు'తో దెబ్బతిన్నవారికి 'అజ్ఞాతవాసి'ఇలా చేసుకుంటూ వస్తున్నాడు. మరోవైపు పవన్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో చిత్రం చేస్తాడా? లేదా? అనేది అనుమానంగా మారింది. చేసే ఉద్దేశ్యం ఉంటే ఆ చిత్రాన్ని 'అజ్ఞాతవాసి' ద్వారా నష్టపోయిన వారికి ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత రాధాకృష్ణలు ఈ చిత్రంతో నష్టం వచ్చిన వారికి తమ పరిహారంగా ఎన్టీఆర్‌తో చేసే చిత్రం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఇక పవన్‌ విషయానికి వస్తే ఆయన కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయాల్సివస్తోందని గతంలో వాపోయాడు.

కాగా 'అజ్ఞాతవాసి' కోసం పవన్‌ 30కోట్లు, త్రివిక్రమ్  20కోట్లు పారితోషికం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కొని నష్టపోయిన వారికి నష్టాలను భర్తీ చేయడం కోసం పవన్‌ తన పారితోషికంలోని 30కోట్లలో 15కోట్లు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడట. మరోవైపు ఈ చిత్రానికి త్రివిక్రమ్‌, పవన్‌లు రెమ్యూనరేషన్‌ తీసుకోకుండా, లాభాలలో పారితోషికం మాత్రమే తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. మరి ఈ విషయంలో పవన్‌ తన రెమ్యూనరేషన్‌లోంచి 15కోట్లు డిస్ట్రిబ్యూటర్ల లోటుని భర్తీ చేయడానికి ఇవ్వడం ఎంత వరకు నిజమో తెలియాల్సివుంది...!

Pawan Kalyan returns back His Remuneration?:

Agnathavasi Effect on Power Star Pawan Kalyan Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs