'జ్యోతిలక్ష్మి'కి ముందు హీరోయిన్‌గా లేదా ఐటం సాంగ్స్ ద్వారానే అయినా సరే చార్మి బిజీగానే ఉండేది. కానీ ఆ తర్వాత ఆమెకు నటిగానే గాకుండా ఐటం సాంగ్స్ కూడా పెద్దగా రావడం లేదు. మరోవైపు డ్రగ్స్ వివాదంలో చిక్కుకుని కొంత కాలం వార్తల్లో నిలిచింది. మరోవైపు పూరీ జగన్నాథ్ ఆఫీస్‌ని మొత్తం తన అజమాయిషీతో నడుపుతోంది. ఆయన ఆఫీస్‌స్టాఫ్ నుంచి ఆయనకు కథ, డైరెక్షన్‌లో సహాయకులను కూడా చార్మినే నియమిస్తూ, తొలగిస్తూ పెత్తనం చేస్తోంది. మరోవైపు పూరీకి అత్యంత సన్నిహితుడైన గురువు రాంగోపాల్ వర్మకి కూడా కుడి భుజంగా పనిచేస్తోందని సమాచారం.
పూరీ, వర్మ చిత్రాలకు, ప్రొడక్షన్ నుంచి లొకేషన్లు, ప్రమోషన్స్ చూసుకుంటూ లైన్ ప్రొడ్యూసర్‌గా మారింది. ఇక పూరీ కూడా ఆమె కష్టానికి మెచ్చి 'పైసావసూల్'కి అన్నిపనులు దగ్గరుండి చూసుకోవడంతో తన రెమ్యూనరేషన్‌లో కొంత భాగం ఆమెకి ఇవ్వడమే కాదు... నిర్మాత ఆనంద్‌ప్రసాద్ నుంచి కూడా మంచి రెమ్యూనరేషన్ ఇప్పించినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఆమె ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరీతో చేస్తున్న 'మెహబూబా' పనులన్నీ స్వయంగా చూసుకుంటోంది. ఆ మధ్య హిమాచల్ ప్రదేశ్‌లోని మంచు ప్రాంతంలో యూనిట్ కష్టపడుతున్న ఫొటోలను, వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి, నా సొంత పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం చాలా బాధగా ఉందని తెలిపింది. ఆ తర్వాత వర్మ శ్రీదేవి నటించిన బాలీవుడ్‌లోని ఓ పాటను తన్మయత్వంలో పక్కనే వోడ్కా పెట్టుకుని ధ్యానంలో నిమగ్నమైన అతడి ఫొటోలను కూడా సోషల్‌మీడియాలో పెట్టి శ్రీదేవి భక్తుడు అని తెలిపింది.
తాజాగా ఆమె తాను పెంచుకుంటున్న చిలక మిట్టూతో కలిసి ఒకే కంచంలో అన్నం తింటూ, దానితో ఆడుకుంటూ, అన్నం తినిపిస్తూ ఆ పెంపుడు చిలుకతో లిప్‌లాక్ ఇచ్చింది. మింటూతో కలిసి లంచ్ చేస్తున్నానంటూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. ఈమెకి పెంపుడు జంతువులంటే భలే ఇష్టం. గతంలో కూడా తన కుక్కపిల్లలతో ఫొటోలు దిగివరుసగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తుండేది. మరి ఆమె పెంపుడు చిలకగా మేము కూడా మారితే చార్మి తమకు కూడా లిప్‌లాక్ ఇస్తుంది కదా.. అంటూ శృంగార ప్రియులు నిట్టూర్పులు విడుస్తున్నారు.