Advertisement
Google Ads BL

భార్యకి మంచు విష్ణు ఇచ్చిన గిఫ్ట్‌ అదిరింది!


తన కెరీర్‌లో 'ఢీ, దేనికైనా రెడీ, ఆడోరకం.. ఈడోరకం' వంటి హిట్స్‌ మాత్రమే ఉన్న మంచు విష్ణు జనవరి 26వ తేదీన 'ఆచారి అమెరికా యాత్ర'ద్వారా రానున్నాడు. తనకి మంచి హిట్స్‌ ఇచ్చిన జి.నాగేశ్వర్‌రెడ్డితోనే ఆయన ఈ చిత్రం చేస్తుండటం విశేషం కాగా తనకు మరో సెంటిమెంట్‌గా భావించే బ్రహ్మానందం ఇందులో కీలకపాత్రను పోషిస్తున్నాడు. టైటిల్‌కి తగ్గట్లుగా ఈ చిత్రం షూటింగ్‌ అమెరికాలో ఎక్కువగా షూటింగ్‌ జరుపుకుంది. ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలోని ఓ పాట టీజర్‌ని తాజాగా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. 'చెలియా చెలియా .. అరెరే నేననుకున్నానా...కలనైనా కలగన్నానా' అని సాగే ఈ పాట విడుదల సందర్బంగా మంచు విష్ణు ఈ పాటను తన శ్రీమతి విరనికాకి పుట్టినరోజు కానుకగా ఇస్తున్నానని చెబుతూ, విరనికాని ఉద్దేశించి ట్వీట్‌ చేశాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ, 'నన్ను అమితంగా ప్రేమించే అందమైన మహిళకు ఈ పాట అంకితం. ఈ పాటలోని ప్రతి పదం నిన్ను ఉద్దేశించినదే. ఇందులోని ప్రతి పదం నాకు నీపై ఉన్న ప్రేమను తెలుపుతుంది. హ్యాపీ బర్డ్‌డే టు మై లవ్‌.. ఈ పాట నీకే అంకితం' అని చేసిన ట్వీట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో మంచు విష్ణు హీరోయిజం లుక్‌, ప్రగ్యాజైస్వాల్‌ అందాలతో పాటు అమెరికాలోని పాటను చిత్రీకరించిన పలు లోకేషస్లు, అమెరికాలో ఎవ్వరూ చూపని కొత్త అందాలను చూపిస్తున్న ఈ పాట విజువల్స్‌ ఐఫీస్ట్‌గా ఉన్నాయనే చెప్పాలి. ఇక ఈచిత్రం మంచి పోటీ మధ్య జనవరి 26న విడుదల కానుండటంతో పోటీని తట్టుకుని ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో చూడాల్సివుంది. మరోవైపు తనకిష్టమైన పాటల్లో ఇది ఒకటని, తన సోదరుడు మంచు విష్ణుకి శుభాకాంక్షలు అని మంచు మనోజ్‌ పేర్కొన్నాడు. మరి వారి కుటుంబ సభ్యులే వారి సినిమాని పొగుడుకుంటున్నారు గానీ బయటి వారు, ముఖ్యంగా మన స్టార్స్‌ పొగిడితేనే ఈ చిత్రానికి కాస్త ప్రమోషన్స్‌ వర్కౌట్‌ అవుతాయని చెప్పాలి. 

Advertisement
CJ Advs

Manchu Vishnu Special Gift To His wife Viranica:

Manchu Vishnu Dedicated AAY Song To His Wife
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs