Advertisement
Google Ads BL

ప్రేమ వ్యవహారం ఒప్పుకున్న రెజీనా!


కెరీర్‌ స్టార్టింగ్‌లో హీరోయిన్‌ రెజీనా బాగానే ఊపుగా కనిపించి యంగ్‌హీరోల సరసన మంచి అవకాశాలతో బాగానే అలరించింది. ఒకానొక దశలో ఈమెతో పాటు అటు ఇటుగా ఇండస్ట్రీకి వచ్చిన రకుల్‌ప్రీత్‌సింగ్‌ వంటి వారు హవా చాటి స్టార్‌హీరోయిన్స్‌గా మారారు. కానీ రెజీనా మాత్రం కెరీర్‌లో బాగా వెనుకపడిపోయింది. గత ఏడాది ఆమె కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'నక్షత్రం', నారా రోహిత్‌ హీరోగా వచ్చిన 'బాలకృష్ణుడు' చిత్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఎవరికి గ్లామర్‌షోలో విషయంలో అడ్డం చెప్పకుండా యంగ్‌ హీరోల నుంచి సీనియర్స్‌ వరకు లిప్‌లాక్‌ సీన్స్‌కి కూడా ఓకే అని చెప్పింది. అయినా ఆమె ఫేట్‌ మారలేదు. ఇక ప్రస్తుతం ఆమె నేచురల్‌ స్టార్‌ నాని నిర్మాతగా, ప్రశాంత్‌ అనే యువ దర్శకుడు తీస్తున్న 'అ' చిత్రంలో కీలకమైన పాత్రను చేస్తోంది. ఇందులో ఆమె కాఫీ షాప్‌లో పనిచేసే బేరర్‌ పాత్రలో, డ్రగ్స్‌కి అలవాటైపోయే యువతి పాత్రలో బోల్డ్‌ పాత్రలో సినిమాలో కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఇందులో ఆమె లుక్స్‌ కూడా ఎంతో వైవిధ్యంగా ఉన్నాయి. 

Advertisement
CJ Advs

గత ఏడాది తనకు ఎంత మాత్రం అచ్చిరాలేదనిచెబుతున్న రెజీనా తాజాగా మాట్లాడుతూ.. నటిని కావాలనేది నాకోరిక. అందుకే ఈ రూట్‌లోకి వచ్చాను. పదేళ్ల కెరీర్‌లో ఎన్నో మలుపులు ఎత్తు పల్లాలు చూశాను. ప్రేమలో పడటం వంటి తప్పులు కూడా చేశాను. పొరపాటు తెలుసుకునేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా అవకాశాలు మిస్‌ అయ్యాయి. ఫలితంగా ఆశించిన విజయాలను అందుకోలేకపోయాను. ఇప్పుడు నా దృష్టి అంతా కెరీర్‌ పైనే. మంచి అవకాశాలు దక్కించుకుని, వరుస విజయాలను సాధించాలని నిర్ణయించుకున్నాను..అని చెప్పుకొచ్చింది. 

అయినా ఆమె అనుకున్న వెంటనే మంచి అవకాశాలు వస్తాయా? విజయాలు ఆమెను వరిస్తాయో లేదో వేచిచూడాల్సి వుంది. కాగా ఆమె ప్రేమించింది సినీ రంగంలోని వ్యక్తినా? లేక ఇంకెవ్వనైనానా?అన్నది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి ఆమెకి మెగా ఫ్యామిలీ హీరోలలో ఒకరితో ఆమెకి లవ్‌ ఎఫైర్‌ ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అదే సమయంలో తాను ప్రేమలో పడి కెరీర్‌నాశనం చేసుకున్నానని ఇప్పుడు ఆమె ఒప్పుకుంటోంది. దీనికి సంబంధించి పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. 

Regina opens about her love affairs:

Regina Revealed Her Love affairs!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs