Advertisement
Google Ads BL

తరుణ్‌ ఇంటి వాడయ్యే సమయం వచ్చిందట!


హీరో తరుణ్‌ కెరీర్‌ని ఆయన తల్లి రోజారమణినే చెడగొట్టిందని, ఆయన్ను తల్లి చాటు బిడ్డగా పెంచి, సినిమా కథల నుంచి కాస్ట్యూమ్స్ వరకు ప్రతి విషయంలోనూ ఆమె విపరీతమైన జోక్యం వల్లనే తరుణ్‌ కెరీర్‌ ఇలా తయారైందని పలువురు అంటూ ఉంటారు. ముఖ్యంగా తరుణ్‌కి, ఆర్తి అగర్వాల్‌కి మధ్య ప్రేమ చిగురించిన సందర్భంలో ఆమె తరుణ్‌ని బాగా కట్డడి చేయడం, తరుణ్‌ ప్రేమకి నో చెప్పడంతో ఆర్తిఅగర్వాల్‌ సైతం తీవ్ర డిప్రెషన్‌కిలోనై మరణించిందని, ఆమె ఘోషే తరుణ్‌ కెరీర్‌కి తగిలిందని కూడా ఇండస్ట్రీలో అంటూ ఉంటారు. ఇక తరుణ్‌ ఇప్పటికీ వివాహం చేసుకోలేదు. 

Advertisement
CJ Advs

తాజాగా తరుణ్‌ పెళ్లి విషయమై ఆయన తల్లి రోజా రమణి నోరు విప్పింది. ప్రస్తుతం తరుణ్‌ ఓ చిత్రంలో నటిస్తున్నాడని, మరో రెండు స్టోరీలను ఓకే చేశామని చెప్పిన రోజారమణి తన కుమార్తె అమూల్య ఇంటీరియల్‌ డిజైనింగ్‌ చేసిందని, తన ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉందని తెలిపింది. మంచి సంబంధాలు వస్తే తరుణ్‌తో పాటు మా అమ్మాయికి కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాం. మంచి అబ్బాయి, అమ్మాయిల వేటలో ఉన్నాం.. బహుశా వచ్చే ఏడాది తరుణ్‌తో పాటే మా కూతురి వివాహం జరగవచ్చు అని రోజారమణి చెప్పుకొచ్చింది. మరి పెళ్లయిన తర్వాత అయినా తరుణ్‌ కెరీర్‌ మరలా ఊపందుకుంటుందో లేదో వేచిచూడాల్సివుంది...! 

Roja Ramani Talks About Tarun Marriage:

Tarun Will Get Married Soon - Roja Ramani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs